Begin typing your search above and press return to search.

గ్లామర్ క్వీన్ లా సామ్ మెరుపులు

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన సమంత ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   26 April 2025 7:15 PM IST
గ్లామర్ క్వీన్ లా సామ్ మెరుపులు
X

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన సమంత ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలోనే తక్కువ సినిమాలతో తెలుగులో గుర్తింపు పొందిన సమంత, ఆ తర్వాత హిట్ ఫిల్మ్స్‌తో వరుస విజయాలు సాధించింది. స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్‌లలో కూడా మెరిసిన సమంత, తన అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో బలమైన స్థానాన్ని సంపాదించింది.

లేటెస్ట్ గా సమంత తన తాజా ఫోటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. అబుదాబిలో దిగిన ఈ ప్రత్యేక ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మెరిసే బ్లూ అవుట్‌ఫిట్‌లో సమంత అపురూపంగా కనిపించింది. ట్రెడిషనల్ టచ్ ఉన్న మోడర్న్ డిజైన్ డ్రెస్‌లో సమంత చూపులు కట్టిపడేస్తున్నాయి.

మినిమల్ మేకప్‌, క్లాసీ జ్యూవెలరీ, రిఫైన్డ్ హెయిర్ స్టైల్‌తో సమంత ఎలిగెన్స్‌ను మరింత పెంచింది. ఈ ఫోటోల్లో సమంత స్టైల్, గ్రేస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ యాంగిల్‌లో చూసినా ఆమె ఛార్మ్ మాయ చేసేలా ఉంది. మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందర్నీ ఆకట్టుకునేలా సమంత ప్రెజెన్స్ ఉంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌ను తెచ్చుకుంటున్నాయి.

సమంత ఫ్యాన్స్ మాత్రమే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఈ ఫోటోషూట్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సమంత, తన ఆరోగ్య పరిస్థితిని బాగుచేసుకొని మళ్లీ తన సినిమాల మీద దృష్టి పెట్టింది. అలాగే టాలీవుడ్‌లోనూ కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన తరువాత ఆమె త్వరగా సినిమాల్లో తిరిగి దర్శనమివ్వాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత ప్రతి తరహా లుక్‌తో కూడా తన మ్యాజిక్ చూపించగలదని మరోసారి నిరూపించుకుంది. ఈ బ్లూ డ్రెస్ ఫోటోషూట్‌తో మళ్లీ ఒకసారి సమంత స్టైల్ ఐకాన్‌గా తన బ్రాండ్‌ను నిలబెట్టుకుంది.