Begin typing your search above and press return to search.

నో సాల్ట్, నో టేస్ట్.. సమంత ఫుడ్‌పై నందినీ రెడ్డి కామెంట్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది.

By:  Madhu Reddy   |   29 Jun 2026 3:30 PM IST
నో సాల్ట్, నో టేస్ట్.. సమంత ఫుడ్‌పై నందినీ రెడ్డి కామెంట్స్ వైరల్
X

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న నందినీ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత కెరీర్, ఆమె హెల్త్ కండిషన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు. సమంత ఆరోగ్యం కోసం తింటున్న ఫుడ్ గురించి నందిని చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఉప్పు, రుచి లేని ఆహారం:

సమంతకు ఉన్న 'ఆటో-ఇమ్యూన్' హెల్త్ కండిషన్ అదే మయోసైటిస్ గురించి మనందరికీ తెలిసిందే. దీని గురించి నందినీ రెడ్డి మాట్లాడుతూ.. సమంత ఆరోగ్యం వెనుక ఆమెకున్న "ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్" కారణమని చెప్పారు. దాదాపు రెండేళ్లుగా సమంత అసలు ఉప్పు, ఎలాంటి రుచి లేని ఆహారాన్ని మాత్రమే తింటున్నారట. ఇక కేవలం ఉడికించిన, ప్యూరీ చేసిన చప్పటి ఫుడ్‌ను రోజుకు మూడు పూటలా తింటూ ఆమె కఠినమైన నియమాలు పాటిస్తున్నట్లు నందిని వెల్లడించారు.

ట్రిగ్గర్స్ కాకుండా జాగ్రత్తలు:

ఆటో ఇమ్యూన్ సమస్యలకు శాశ్వత నివారణ అంటూ ఏదీ ఉండదని, అది కేవలం కంట్రోల్‌లో మాత్రమే ఉంటుందని నందినీ రెడ్డి వివరించారు. మళ్లీ ఆ వ్యాధి బయటపడకుండా ఉండాలంటే ఇలాంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తప్పనిసరి. ఇక సమంత తినే చప్పటి ఫుడ్‌ను ఆమె ఫ్రెండ్స్ తినడానికి ట్రై చేసి అస్సలు తినలేక చేతులెత్తేసారట. కానీ సమంత మాత్రం ఎంతో ఓపికతో, క్రమశిక్షణతో దీన్ని ఫాలో అవుతున్నారు.

నటనలో అద్భుతమైన పరిణతి:

'ఓ బేబీ' సినిమా సమయానికి, ఇప్పటికీ సమంతలో చాలా మార్పు వచ్చిందని నందిని ప్రశంసించారు.ఇక ఆమె యాక్టింగ్ రేంజ్ మారిపోయిందని, ఎంతో లోతైన పాత్రలను అలవోకగా పోషిస్తోందని అన్నారు. గుడ్ డేస్, బ్యాడ్ డేస్ ఉన్నప్పటికీ..కఠినమైన యాక్షన్ సీన్లు, లాంగ్ సింగిల్ షాట్ ఫైట్స్ కోసం సమంత ఎంతో కష్టపడి ట్రైనింగ్ తీసుకుని మరీ చేసిందని, ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని కొనియాడారు.

స్క్రీన్ మీద గ్లామరస్‌గా కనిపించే స్టార్ హీరోయిన్ వెనుక ఇంతటి కష్టం, క్రమశిక్షణ ఉన్నాయని నందినీ రెడ్డి మాటలతో అందరికీ తెలిసొచ్చింది. ఆరోగ్యం కోసం ధ్యానం, కఠినమైన డైట్ పాటిస్తూ సమంత చూపిస్తున్న పట్టుదల నిజంగా ఎందరికో స్పూర్తిదాయకం. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరో భారీ హిట్ అందుకున్న సామ్.. ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆమె ఎప్పుడూ హెల్తీగా ఉండాలని మనమూ కోరుకుందాం..