కంగారూ దేశంలో కంగారు పుట్టించిన సమంత
ఇలాంటి సమయంలో కొంత గ్యాప్ తీసుకుని ఆస్ట్రేలియా టూర్ ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం కంగారూ దేశం నుంచి సామ్ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో కి వచ్చాయి.
By: Tupaki Desk | 28 March 2025 9:27 AM ISTసమంత రూత్ ప్రభు కొద్దిరోజులుగా ప్రకృతి అందాల నడుమ సేద దీరుతోంది. సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సమంత రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ పైనా దృష్టి సారించింది. ఇటీవల సొంత బ్యానర్ సినిమా బంగారం షెడ్యూల్ గురించి ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో కొంత గ్యాప్ తీసుకుని ఆస్ట్రేలియా టూర్ ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం కంగారూ దేశం నుంచి సామ్ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లోకి వచ్చాయి.
తాజాగా ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్‌ను సందర్శించిన సమంత అక్కడ ప్రకృతి - జంతువుల మధ్య వెకేషన్ డేని ఆస్వాధించింది. గురువారం సమంత ఇన్‌స్టాలో చాలా ఫోటోలను పోస్ట్ చేసారు. ``ప్రకృతి, జంతువులు.. మంచి వైబ్‌లు! కంగారూలకు ఆహారం ఇవ్వడం నుండి నిద్రపోతున్న కోలాలను గుర్తించడం వరకు, ఇది చాలా అందమైన సమయం! వన్యప్రాణుల కోసం ఆస్ట్రేలియన్ లు చేసే అద్భుతమైన పునరావాస పనులన్నింటికీ పార్క్ నిర్వాహకులకు ప్రధాన అభినందనలు`` అని రాశారు.కటాప్, నీలిరంగు డెనిమ్ ప్యాంటు, స్టైలిష్ బూట్లు - హ్యాట్ ధరించి, సమంత అభయారణ్యంలో షికార్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో చిలిపిగా మాట్లాడారు. సమంతకు విష్ చేసారు.
సమంత చివరిగా ప్రైమ్ వీడియో సిరీస్ `సిటాడెల్: హనీ బన్నీ`లో వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించింది. భారతదేశంలో ఈ సిరీస్ చక్కని ఆదరణ దక్కించుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ సిరీస్ 2024 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌లో ఉత్తమ సిరీస్ (విమర్శకులు) , ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సిటాడెల్: హనీ బన్నీ .. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అమెరికన్ టెలివిజన్ సిరీస్ సిటాడెల్ కి భారతీయ స్పిన్-ఆఫ్.
