అట్లీ-బన్నీతో సినిమా ..సమంత క్లారిటీ ఇదే!
అయితే తాజాగా ఈ సినిమాలో ఛాన్స్ పై సమంత స్పందించింది.
By: Tupaki Desk | 7 May 2025 6:18 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దుబాయ్, న్యూయార్క్ అంటూ బన్నీ..అట్లీ బిజీ బిజీగా తిరుగుతున్నారు. మరోవైపు హీరోయిన్ల ఎంపిక వేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి.
దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లలో ముగ్గురు భామలు ఎవరు అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్లలో ఎవరికి ఛాన్స్ వచ్చినా వదులకునే అవకాశం ఉండదు. అయితే తాజాగా ఈ సినిమాలో ఛాన్స్ పై సమంత స్పందించింది. అట్లీ -బన్నీ సినిమాలో నేను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. అట్లీ నాకు మంచి స్నేహితుడు. ఇప్పటికే ఇద్దరం కలిసి సినిమా చేసాం. భవిష్యత్ లోనూ ఏదైనా సినిమా చేస్తాం. కానీ ఇప్పటికైతే ఎలాంటి సినిమా చేయలేదు. బన్నీ సినిమాలో అయితే ఛాన్స్ నాకు రాలేదని కుండ బద్దలు కొట్టేసింది. దీంతో ఐకాన్ స్టార్ 22 హీరోయిన్ లిస్ట్ నుంచి సమంత ఎగ్జిట్ అయింది. ఇంకా స్పందించాల్సింది ఐదుగురు ఉన్నారు.
`ఖుషీ` తర్వాత సమంత కొత్త సినిమా కబురు వెల్లడించని సంగతి తెలిసిందే. సొంతంగా ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ తో నిర్మాణ సంస్థ ను స్థాపించి సినిమాలు నిర్మించే పనిలోనే బిజీగా ఉంది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా? నో చెబుతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆ సందర్భం రావడం లేదు. మరి ఏడాది ముగింపుకైనా ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.