నా టార్గెట్ అదే
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి తమ సినిమా గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 5 May 2025 6:21 AMటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మించిన మొదటి సినిమా శుభం. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో మ్యూజిక్ అందిస్తున్నాడు. శుభం సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి తమ సినిమా గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
వైజాగ్ వచ్చిన ప్రతీసారీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతోంది. వైజాగ్ లో ఫ్యాన్స్ ను చూసి నిజమైన ప్రేమేంటో అర్థమైందన్న సమంత, డైరెక్టర్ ప్రవీణ్ ఎనర్జీ చూసి అంతా మర్చిపోయానని, నిర్మాతగా ఓ కొత్త ఆలోచనతో తాను శుభం అనే సినిమాను స్టార్ట్ చేశానని, కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతోనే నిర్మాతగా మారానని, అదే తన టార్గెట్ అని సమంత చెప్పింది.
తెలుగులో ఇంతవరకు ఇలాంటి హారర్, కామెడీ జానర్ లో సినిమాలు రాలేదని, సమంత లాంటి వాళ్లు లేకపోతే శుభం ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదని, ఎప్పుడైనా రైటర్స్ వల్లే సినిమా నిలబడుతుందని, ఈ సినిమాకు వసంత్ మంచి కంటెంట్ ఇచ్చారని, ఈ సినిమాను ఫస్ట్ షో చూసిన వాళ్లు ఎంతో లక్కీ అని, రిలీజయ్యాక సినిమా గురించి ప్రతీ ఒక్కరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారని, శుభం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ్‌ది చిన్న పిల్లల మనస్తత్వం అని, అతనికి సినిమాపై ఎంతో ప్యాషన్ ఉందని, సీరియల్స్ ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు. దాన్నే శుభంలో హార్రర్ గా మలిచామని, ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చని, మే 9న రిలీజ్ కానున్న శుభం మంచి హిట్ అవుతుందని రైటర్ వసంత్ అన్నారు.
వైజాగ్ లో షూటింగ్ చేసి వెళ్లాక చాలా బాధగా ఉంటుందని, వైజాగ్ ను వదిలి వెళ్లాలనిపించదని, వైజాగ్ లో షూట్ చేసిన సినిమాలన్నీ హిట్ అవుతుంటాయని, తాను చదివిన కాలేజ్ లో సమంతకు స్పెషల్ క్రేజ్ ఉండేదని, ఆమెంతో కష్టపడుతుంటారని, ఆమె ఎంతో నమ్మకంతో శుభంను నిర్మించారని, ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆక్టటుకుంటుందని యాక్టర్ చరణ్ అన్నాడు.
సమంత ఎంతో ధైర్యం చేసిన శుభం సినిమాను నిర్మించి, ఎంతో మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేసి మాతగా మారారని, ఈ సినిమాలో కూడా ఆమె మాతాజీ పాత్రలోనే కనిపిస్తారని, ఈ సినిమా వల్ల ఎంతో మంది మంచి స్నేహితులు దొరికారని, 9వ తేదీన రానున్న శుభం అందరూ చూడదగిన సినిమా అని శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు.
శుభం సినిమాతో తమకెంతో మంచి అవకాశం దొరికిందని, డైరెక్టర్, నిర్మాత తమనెంతో బాగా చూసుకున్నారని, టీమ్ మొత్తం ఫ్రెండ్స్ లా అయ్యామని, శుభం కథ చాలా బావుంటుందని, ఇంత మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉందని, మే 9న రిలీజ్ కానున్న సినిమా అందరినీ అలరిస్తుందని శ్రావణి లక్ష్మి, శ్రియా కొంతం, షాలిని తెలిపారు.