Begin typing your search above and press return to search.

ట్రీట్మెంట్ కి ముందు సమంత మరో షాకింగ్ డెసిషన్..!

త్వరలోనే ఆమె అమెరికా వెళ్లే అవకాశం

By:  Tupaki Desk   |   15 July 2023 11:39 AM GMT
ట్రీట్మెంట్ కి ముందు సమంత మరో షాకింగ్ డెసిషన్..!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె దాదాపు దశాబ్దపు కాలంగా టాలీవుడ్ ని ఏలుతోంది. ఏమాయ చేశావో మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సమంత. అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. చివరిగా సామ్ శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ, మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న ఆమె ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది.

మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తౌతోంది. కాగా, సమంత ఈ మూవీ మాత్రమే కాదు, సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తైపోయింది.

కాగా, తన చేతిలో ఉన్న షూటింగ్స్ అన్నీ సమంత పూర్తి చేసేసుకుంది. ఇప్పుడు ఆమె దాదాపు సంవత్సరం పాటు బ్రేక్ తీసుకుంది. సమంత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందన్న విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలోనే ఆమె అమెరికా వెళ్లి దానికి చికిత్స తీసుకోవాలి అని అనుకుంటున్నారు.

త్వరలోనే ఆమె అమెరికా వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ అమెరికా వెళ్లడానికి ముందు ఆమె మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సమంత రోడ్ ట్రిప్ కి వెళ్తున్నారట. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రోడ్ ట్రిప్ ని ఇప్పుడు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వివరించారు. కారులో వెళ్తుండగా, యువన్ శంకర్ రాజా తమిళ పాటలను వింటోంది.

దీనికి సంబంధించిన వీడియోని సమంత షేర్ చేశారు. సమంత కారులో పలు దేవాలయాలను సందర్శించాలని అనుకుంటోందట. ఆ తర్వాతే అమెరికా వెళ్తుందట. మరోవైపు ఆమె చికిత్స కోసం వెళ్తోందని తాజాగా ఆమె స్టైలిస్ట్ రోహిత్‌ భట్కర్‌ అధికారికంగా కన్ఫామ్ చేశారు. అంతేకాకుండా, ఆమె గురించి చాలా ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ కూడా పెట్టడం విశేషం.