Begin typing your search above and press return to search.

స‌మంత అభిమానించే హీరోలు వీళ్లే!

ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే స‌మంత అభిమానించే హీరోలు ఎవ‌రు? అంటే ఇంత వ‌ర‌కూ అలాంటి ప్ర‌శ్న ఆమె ముందుకు వెళ్ల‌లేదు. స‌మంత కూడా త‌న‌కు తానుగా ఎప్పుడూ చెప్పింది కూడా లేదు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:30 PM GMT
స‌మంత అభిమానించే హీరోలు వీళ్లే!
X

సౌత్ లో స‌మంత క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అవ‌కాశాల‌న్నింటిని అమ్మ‌డు వెయిటింగ్ లో పెట్టేసి విశ్రాంతి తీసుకుంటుందంటేనే ఏ రేంజ్ హీరోయిన్ అన్న‌ది ఊహించొచ్చు. 'సీటాడెల్' సిరీస్ స‌క్సెస్ అయితే గ‌నుక నార్త్ లోనూ అమ్మ‌డికి తిరుగుండ‌దు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే అక్క‌డ నుంచి స‌క్సెస్ అయ్యే దిశ‌గా సీరియ‌స్ గానే పావులు క‌దుపుతుంది. అక్క‌డ పోటీని త‌ట్టుకుని మార్కెట్ లో నిల‌బ‌డ‌టం ఎలా అన్న దానిపై ప‌క్కా వ్యూహంతో దిగ‌బోతుంది.

స‌మంత విరామం తీసుకోవ‌డానికి కార‌ణం కూడా ఈ ర‌క‌మైన ఆలోచ‌న అయి ఉండొచ్చు అన్న‌ది కొంత మంది భావిస్తున్నారు. అల‌సి సొల‌సిన శ‌రీరానికి కాస్త విరామం కూడా ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని..కేవ‌లం విరామం కోస‌మే అమెరికా వెళ్లలేద‌ని వెనుక పెద్ద ప్లానింగే ఉంద‌న్న‌ది మ‌రికొంత మంది వాద‌న‌. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే స‌మంత అభిమానించే హీరోలు ఎవ‌రు? అంటే ఇంత వ‌ర‌కూ అలాంటి ప్ర‌శ్న ఆమె ముందుకు వెళ్ల‌లేదు. స‌మంత కూడా త‌న‌కు తానుగా ఎప్పుడూ చెప్పింది కూడా లేదు.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌ట‌న అంటే స‌మంత ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుందిట‌. ఇటీవ‌ల ఆయ‌త‌నో పాటు ఓ యాడ్ షూట్ లో పాల్గోన్న సంద‌ర్భంగా అభిమాన న‌టుడు ఎవ‌రు? అంటే ఆయ‌న పేరు సూచించింది. షూటింగ్ అనంత‌రం మ‌మ్ముట్టితో క‌లిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. అలాగే మ‌రో నటుడిగా ప‌హాద్ పాజిల్ పేరు సూచించింది. వీళ్లిద్ద‌రు న‌టించిన సినిమాల్ని వీలు కుదిరినప్పుడ‌ల్లా చూస్తుంటుందట‌. వాళ్లు పోషించే వైవిథ్య‌మైన పాత్ర‌ల‌కు ఈజీగా క‌నెక్ట్ అవుతాన‌ని తెలిపింది.

మొత్తానికి స‌మంత అభిమానించే న‌టులు మ‌ల‌యాళం నుంచ‌ని తేలిపోయింది. అమ్మ‌డు స‌క్సెస్ అయింది టాలీవుడ్ లో న‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ఎంతో మంది హీరోల‌తో క‌లిసి ప‌నిచేసింది. వ్య‌క్తిగ‌తంగా ఇంట‌ర్వ్యూలు సైతం చేసింది. కానీ ఏనాడు అభిమాన న‌టుల గురించి మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం స‌మంత త‌దుప‌రి సినిమాల‌కు స‌న్న‌ధం అవుతుంది.