Begin typing your search above and press return to search.

జక్కన్న హీరోయిన్‌ రీ ఎంట్రీ వర్కౌట్ అయ్యేనా?

హర్రర్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Aug 2023 4:00 AM GMT
జక్కన్న హీరోయిన్‌ రీ ఎంట్రీ వర్కౌట్ అయ్యేనా?
X

రాజమౌళి, సునీల్ కాంబోలో వచ్చిన 'మర్యాద రామన్న' సినిమా లో నటించిన ముద్దుగుమ్మ సలోని. పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో కొన్ని సినిమాలకే కనుమరుగు అయింది. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీకి సలోని రెడీ అవుతోంది.

తంత్ర చిత్రంతో సలోని రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తంత్ర సినిమాలో సలోని కీలక పాత్రలో కనిపించబోతుంది. హర్రర్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నటిగా సలోనికి ఇది మంచి రీ ఎంట్రీని తెచ్చి పెట్టేనా చూడాలి. ఈ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటే సలోనికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అయినట్లే. హీరోయిన్ గా కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వరుస ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సినిమా ఆమెకు చాలా కీలకం.

సలోని గతంలో నటించిన మర్యాద రామన్న సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, మగధీర సినిమాలో ప్రత్యేకమైన చిన్న పాత్రలో కనిపించింది. ఇక బాడీ గార్డ్‌, రేసు గుర్రం సినిమాల్లో కూడా సలోని కీలక పాత్రల్లో కనిపించింది. ఇక మీదట కూడా సలోనికి వరుసగా కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తాయేమో చూడాలి.