Begin typing your search above and press return to search.

స‌ల్మాన్, ట‌బు పెళ్లి ప్లాన్స్ ఇలా ఉన్నాయి

బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ జాబితాలో స‌ల్మాన్ భాయ్ పేరు ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో ఉంటుంది

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:30 AM GMT
స‌ల్మాన్, ట‌బు పెళ్లి ప్లాన్స్ ఇలా ఉన్నాయి
X

బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ జాబితాలో స‌ల్మాన్ భాయ్ పేరు ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఒక‌వేళ మోస్ట్ ఎలిజిబుల్ బ్ర‌హ్మ‌చారిణి ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే క‌చ్ఛితంగా జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు కాకుండా ఇంకెవ‌రు ఉంటారు? అని ఎదురు ప్ర‌శ్నిస్తారు. ఆ ఇద్ద‌రి బ్యాచిల‌ర్ షిప్ గురించి చాలా వేదిక‌ల‌పై చాలా కాలంగా డిబేట్లు ర‌న్ అవుతూనే ఉంటాయి. స‌ల్మాన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ట‌బు ఎందుకు ఇంకా పెళ్లి మాట ఎత్త‌లేదు? అంటూ అభిమానులు ఎప్ప‌టికీ డైల‌మాలోనే న‌లిగిపోతున్నారు. అయితే పెళ్లాడాలా వ‌ద్దా? అనే విష‌యంలో ఎవ‌రి కార‌ణాలు వారికి ఉంటాయి.

స‌ల్మాన్, ట‌బు ఇప్పుడు ఒకే వేదిక‌పై త‌మ పెళ్లి గురించి ప్ర‌స్థావించారు. దీనికి 'బిగ్ బాస్ 17' వేదిక‌గా మారింది. సల్మాన్ ఖాన్, టబు తమ వివాహ ప్రణాళికలపై జోకులు వేసుకున్నారు. నిజానికి టబు, సల్మాన్ ఖాన్ గేమ్ ఆడటంతో ఎపిసోడ్ మొదలైంది. తమ మ‌ధ్య‌ స్నేహం చాలా కాలంగా ఉందని, ఒకరికొకరు బాగా తెలుసునని, ఒకరితో ఒకరు ఇంటర్వ్యూలు ఇవ్వగలమ‌ని అన్నారు. ఆ ఇద్ద‌రూ వేదిక‌పై తమ ముందు ఉన్న పెట్టె నుండి వారు ఎంచుకునే ఒకరి ప్రశ్నలకు మరొకరు జ‌వాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వేదిక‌పై ద‌బాంగ్ లో పాట‌కు ట‌బు డ్యాన్స్ చేసారు. అనంత‌రం ట‌బు, స‌ల్మాన్ ఇంటి స‌భ్యుల‌తో ఆస‌క్తిక‌రంగా చాట్ చేసారు.

ఇక ఇదే వేదిక‌పై సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్‌లను 'అన్మోల్ రతన్స్' అని కూడా పిలిచింది. ఈ సీజన్‌లోని కంటెస్టెంట్స్ గురించి ఏమనుకుంటుందనే దాని గురించి హోస్ట్ ప్ర‌శ్నించారు. వారు పిల్లలు... ఆడుకుంటున్నారు! అని ట‌బు బదులిచ్చారు. ఇంటి స‌భ్యుల్లో ఇష్ట‌మైన వారి గురించి ట‌బు మాట్లాడుతూ, విక్కీ చాలా మంచివాడు అని కాంప్లిమెంట్ ఇవ్వ‌గా, అరుణ్‌ను ఇష్టపడుతున్నాను.. ఎందుకంటే అతడు కూడా హైదరాబాద్‌కు చెందినవాడు.. అని వ్యాఖ్యానించారు.

పెళ్లి చూపుల‌కైనా వెళ్ల‌లేదు:

బిగ్‌బాస్ 17 కంటెస్టెంట్ ఫెరాస్ ఆచారం (పెళ్లి కి ముందు చూపులు) గురించి ఒక ఫన్నీ సంఘటనను షేర్ చేసారు. తాను నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు పెళ్లి చూపుల‌కు వెళ్ళినట్లు పేర్కొన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన తర్వాత సల్మాన్ ఖాన్ అత‌డిని మళ్లీ ఆచారం పాటించాల‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. వ్యంగ్య స్వరంలో పోటీదారుడు చమత్కరించాడు. ''భాయ్ బహుశా అలా చేయడం లేదు కాబట్టి మనల్ని మళ్ళీ మ‌ళ్లీ ఎంక‌రేజ్ చేస్తున్నారు'' అంటూ న‌వ్వేసాడు. ఇంత‌లోనే ఈ డిబేట్‌లోకి టబు చేరి హాస్యభరితంగా వ్యాఖ్యానించారు. ''మేము ఫెరాస్ లో పాల్గొనడం లేదు కాబట్టి, మా తరపున ఇతరులను ఆ పని చేసేలా ప్రోత్స‌హిస్తున్నాము. మీరు పూర్తి చేసారు గ‌నుక‌ మా ఇద్దరిని వదిలిపెట్టండి'' అంటూ న‌వ్వేశారు. సల్మాన్ ఖాన్ నవ్వుతూ- ''మేము వీల్ చైర్‌లలో చేస్తాము..అక్కడ నుండి నేరుగా చితికి వెళ్తాము'' అంటూ న‌వ్వేసాడు.