Begin typing your search above and press return to search.

చెయ్యి చూసారా! ఎంత ర‌ఫ్ గా ఉందో?

ఇక ఇదే ఉత్సాహంలో కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హీరోగా విష్ణు వ‌ర్ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ది బుల్' అనే యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jan 2024 12:44 PM GMT
చెయ్యి చూసారా! ఎంత ర‌ఫ్ గా ఉందో?
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌లే టైగ‌ర్ -3 తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. చాలా కాలంగా స‌ల్మాన్ ఖాతాలో స‌రైన హిట్ లేదు. దీంతో టైగ‌ర్ 3 ఫ‌లితం మిగ‌తా సినిమాల‌తో పోల్చుకుంటే ఎంతో మెరుగ్గా ఉంది. అందుకే ప్ర‌త్యేకించి ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ను కూడా ముంబైలో నిర్వ‌హించారు. దీంతో స‌ల్మాన్ తానెంత సంతోషంగా ఉన్నాడు? అన్న‌ది ప్రేక్ష‌కాభిమానుల‌కు అర్ద‌మైంది.


ఇక ఇదే ఉత్సాహంలో కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హీరోగా విష్ణు వ‌ర్ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ది బుల్' అనే యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. క‌ర‌ణ్ జోహార్ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్నారు. ఓ ముఖ్యమైన మిషన్‌ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్ ఇది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ పారామిలటరీ ఆఫీసర్‌గా క‌నిపించ నున్నాడు.

ఓ చారిత్రాత్మక మిషన్ ద్వారా తన టీంను నడిపించే పారాట్రూపర్ పాత్రను పోషించడం చాలా ప్రత్యేకమైంది. పారాట్రూ పర్‌గా నటించే అవకాశం సంతోషకరమైనది.. గౌరవంగా భావిస్తున్నానని సల్లూభాయ్ ఇప్ప‌టికే రివీల్ చేసాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. స‌ల్మాన్ ఖాన్ చేతిని ఈ పోస్ట‌ర్ లో హైలైట్ చేసారు. ఇందులో స‌ల్మాన్ నాలుగు వేళ్లు..వాటిపై న‌రాలు తేలిన వైనం చూస్తుంటే? ర‌క్తం ఎంత వేడిగా న‌రాల్లో ప్ర‌వ‌హిస్తుందో తెలుస్తోంది.

ఎదురుగా జాతీయ జెండా రెప రెప‌లాడుతోంది. దాన్ని చూస్తూ స‌ల్మాన్ శ‌త్రువుల‌పై పిడికిలి బిగించ‌డానికి స‌న్న‌దం అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో స‌ల్మాన్ ఫేస్ ని ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. కేవ‌లం చేతి వేళ్లు మాత్ర‌మే చూపించారు. సోష‌ల్ మీడియాలో అభిమా నులు త‌మ కామెంట్ల రూపంలో అభిప్రాయాలు చెబుతున్నారు. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా విష్ణు వ‌ర్ద‌న్ కి మంచి పేరుంది. ది బుల్ కూడా దేశ భ‌క్తి నేపథ్యం ఆధారంగా తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.