Begin typing your search above and press return to search.

25 ఏళ్ల తర్వాత మ‌ళ్లీ ఆ క్రేజీ కాంబినేష‌న్!

తాజాగా మ‌ళ్లీ 25 ఏళ్ల త‌ర్వాత ఆ కాంబో లో సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోంది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా క‌రుణ్ జోహార్ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదిరింది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 6:49 AM GMT
25 ఏళ్ల తర్వాత మ‌ళ్లీ ఆ క్రేజీ కాంబినేష‌న్!
X

బాలీవుడ్ లో' కుచ్ కుచ్ హోతా హై' సంల‌చ‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌ల్మాన్ ఖాన్-క‌రుణ్ జోహార్ కాంబినేష్ లో రిలీజ్ అయిన సినిమా అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. స‌ల్మాన్ ఖాన్ న‌ట‌న‌..క‌రుణ్ మేకింగ్ సినిమాని గొప్ప స్థాయిలో నిల‌బెట్టాయి. అయితే ఆ హిట్ కాంబినేష‌న్ ఆ త‌ర్వాత మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌లేదు.

స‌ల్మాన్ ఎంతో మంది ద‌ర్శ‌కుల్ని రిపీట్ చేసారు గానీ మ‌ళ్లీ క‌ర‌ణ్ తో మాత్రం సినిమా చేయ‌లేదు. అలాగే క‌ర‌ణ్ జోహార్ కూడా ఎంతో మంది ద‌ర్శ‌క‌-హీరోలతో పనిచేసారు.కానీ ఆ క్రేజీ కాంబో మాత్రం చేతులు క‌ల‌ప‌లేదు. తాజాగా మ‌ళ్లీ 25 ఏళ్ల త‌ర్వాత ఆ కాంబో లో సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోంది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా క‌రుణ్ జోహార్ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదిరింది. అయితే ఈ సినిమాకి క‌ర‌ణ్ కేవ‌లం నిర్మాత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడి బాధ్య‌త‌లు మాత్రం తాను తీసుకోవ‌డం లేదు. 'షేర్ షా' సినిమాతో పేరు తెచ్చుకున్న విష్ణు వ‌ర్ద‌న్ అనే ఈ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్నాడు.

ఇదెంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్ట్. న‌వంబ‌ర్ లో ప్రారంభం కానుంది. ఈనెల‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం పూర్తి కానున్నాయి. ఇది ఓ భారీ యాక్ష‌న్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది. మునుపెన్న‌డు చూడ‌ని కొత్త భాయ్ ని తెర‌పై ఆవిష్క‌రించ బోతున్నారు. ఈ ఏడాది ప్రారంభించి వ‌చ్చే ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారుట‌. 'షేర్ షా' సినిమాతో విష్ణు వ‌ర్ద‌న్ కి మంచి పేరొచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని సాధించింది.

విష్ణు వ‌ర్ద‌న్ తెలుగులో 'పంజా' సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. గ్యాంగ స్ట‌ర్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన సినిమా అంచ‌నాలు అందుకోవ‌డం లో మాత్రం విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.

'షేర్ షా' సినిమాతోనే బాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. అంత‌కు ముందు కోలీవుడ్ లో కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసాడు. 'షేర్ షా' హిట్ త‌ర్వాత హిందీలొ మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ -క‌ర‌ణ్ జోహార్ ప్రాజెక్ట్ ని ఒడిసి ప‌ట్టుకున్నాడు.