Begin typing your search above and press return to search.

గుండె నిండా దేశభక్తితో సెల్యూట్ కొడతారు..!

శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు ట్రైలర్ రాం చరణ్, హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:13 AM GMT
గుండె నిండా దేశభక్తితో సెల్యూట్ కొడతారు..!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ట్రైలర్ రిలీజైంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు ట్రైలర్ రాం చరణ్, హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచగా వాలెంటైన్ మరింత ఆసక్తి పెరిగేలా చేసింది.

IAF అధికారి అయిన అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్)కి గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. అది అతని వైఖరి, విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదల ఉన్నవాడు. రాడార్ ఆఫీసర్ సోనాల్ (మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉన్న అడ్వెంచర్ లవర్. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణిస్తారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కోని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్ ఆఫీసర్ సోనాల్ ఉంటుంది. వరుణ్ తేజ్ అడ్వంచరస్ స్క్వాడ్రన్ లీడర్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అదరగొట్టారు. యూనిఫాంలో వరుణ్ తేజ్ చూడటం కన్నుల పండువగా వుంది. మానుషితో కెమిస్ట్రీ బాగా కుదిరింది.

భారత వైమానిక దళం (IAF) ధైర్యానికి నివాళిగా, ఆపరేషన్ వాలెంటైన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ తో పాటుగా భావోద్వేగాలు గూస్‌ బంప్స్ తెప్పిస్తున్నాయి. కథాంశం అద్భుతంగా వుంది. యాక్షన్, ఎమోషన్, సంగీతంతో పాటు దేశభక్తి రోమాన్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. డైలాగ్స్ కూడా ఇంపాక్ట్ ఫుల్ గా అనిపిస్తున్నాయి. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా అద్భుతమైన టేకింగ్ సినిమాకు మరో హైలెట్ గా నిలిచేలా ఉంది. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్ అందించేలా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్టిపడేశారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సందీప్ ముద్దా నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా ఉన్నారు. తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా మార్చి 1న రిలీజ్ అవుతుంది.

గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా చూస్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్ నాకు మా టీంకు వుంది. అందుకే ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాని తీయగాలిగాం.

తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో ఉన్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ కి సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్స్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలను మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. కచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం. జై హింద్’’ అన్నారు.

హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ వాలెంటైన్ చాలా స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఇది నాకు డ్రీమ్ రోల్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ కి దక్కుతుంది. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ లో విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం అన్నారు

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కృషి. టీం అందరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాని ఎంజాయ్ చేయండని అన్నారు.