Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ గుండు ఫోటోలు వైరల్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండుతో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేశాడు

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:59 AM GMT
సూపర్ స్టార్ గుండు ఫోటోలు వైరల్‌
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండుతో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేశాడు. సాధారణంగా ఒక మోస్తరు జుట్టులో ఎప్పుడూ కనిపించే సల్మాన్‌ ఖాన్‌ ఈసారి గుండులో కనిపించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. హీరలు ఇలా గుండులో కనిపించినా, జుట్టు పెంచుకుని కనిపించినా కూడా అది సినిమాకే అని అర్థం అవుతుంది.

సల్మాన్ ఖాన్ గుండు కూడా ఏదో ఒక సినిమాకే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ ఫోటోలు సల్మార్ తదుపరి సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌ సౌత్ దర్శకుడు విష్ణవర్ధన్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా కోసం సల్మాన్ చాలా స్టైలిష్‌ గా కనిపించబోతున్నాడు. అందుకే ఇలా గుండులో కనిపించాడు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విష్ణు వర్థన్‌ ఇప్పటి వరకు రూపొందిన సినిమాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా చూపించాడు. ఆ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరో మరియు టేకింగ్ స్టైలిష్ గా ఉందని టాక్ వచ్చింది.

సల్మాన్‌ తో విష్ణు వర్ధన్‌ రూపొందించే సినిమా ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో సాగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా సల్మాన్ ఖాన్‌ ను చూపించబోతున్నారు. కరణ్‌ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాజిద్‌ నడియాడ్ వాలా ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కిసీకా భాయ్ కిసీకా జాన్‌ సినిమా ఫెయిల్‌ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్ తన తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే సినిమా కోసం కాస్త రిస్క్ అయినా కూడా గుండుతో కనిపించి సర్ ప్రైజ్‌ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు సల్మాన్‌ సూపర్‌ హిట్‌ మూవీ ప్రాంచైజీ టైగర్ కూడా రాబోతుంది.