Begin typing your search above and press return to search.

ఆ క్రేజీ కాంబినేష‌న్ పై ఇదే క్లారిటీ

స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఇదే నిర్మాణ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ కూడా ధృవీక‌రించాడు.

By:  Tupaki Desk   |   12 March 2024 7:32 AM GMT
ఆ క్రేజీ కాంబినేష‌న్ పై ఇదే క్లారిటీ
X

నిన్న‌టివ‌ర‌కూ బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో ముర‌గ‌దాస్ సినిమా చేస్తున్నాడా? లేదా? అనే ఓ క‌న్ ప్యూజ న్ ఉండేది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 'కిక్ -2' వ‌స్తుంద‌ని దాన్ని సాజిద్ న‌డియావాలా నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌చా రంలోకి రావ‌డంతో వెంట‌నే ఆ క‌థ‌నాల్ని సాజిద్ ఖండించాడు. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా ఏంటి? ముర‌గ‌దాస్ తో ఓ ప్ర‌త్యేక‌మైన చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు. దీంతో స‌ల్మాన్ ఖాన్ 'కిక్ -2' స‌ప‌రేట్ ప్రాజెక్ట్ అయితే..ముర‌గ‌దాస్ సినిమా మ‌రో హీరోతోనా? అని అంతా అనుకున్నారు.

అయితే గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మ‌రో స‌ర్ ప్రైజ్ ప్ర‌క‌ట‌న‌తో ముందుకు వ‌చ్చేసింది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఇదే నిర్మాణ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ కూడా ధృవీక‌రించాడు. దీంతో ముగ్గురి కాంబినేష‌న్ లో సినిమా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా విడుద‌ల చ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా క‌థ‌? న‌టీన‌టులు...టెక్నీషియ‌న్ల‌కు సంబంధించిన వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే రివీల్ చేస్తారు.

దీంతో స‌ల్మాన్-ముర‌గ‌దాస్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇది ప‌క్కా ముర‌గ‌దాస్ మార్క్ ఎంట‌ర్ టైనర్ అని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప‌నిగ‌ట్టుకుని ముర‌గ‌దాస్ ని తీసుకోవ‌డం వెనుక ఇటీవ‌ల సౌత్ మేక‌ర్స్ స‌క్సెస్ స‌న్నివేశ‌మే కార‌ణమంటున్నారు. పాన్ ఇండియాలో సౌత్ సినిమాలు ఏ రేంజ్ లో స‌త్తా చాటుతున్నాయో తెలిసిందే. 'క‌బీర్ సింగ్'..'యానిమ‌ల్' చిత్రాల‌తో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో ఎంత ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే.

ఇక ముర‌గ‌దాస్ 'గ‌జ‌నీ' రీమేక్ తో తో అక్క‌డా ప్రూవ్ చేసుకున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన ఆ సినిమా వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధించింది. ఆ త‌ర్వాత హిందీలో అవ‌కాశాలు వ‌చ్చినా ముర‌గ‌దాస్ చేయ‌లేదు. మ‌ళ్లీ ఇంత గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ లో కంబ్యాక్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం ముర‌గ‌దాస్ కోలీవుడ్ లో శివ కార్తికేయ‌న్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే బాలీవుడ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్ట‌నున్నాడు.