Begin typing your search above and press return to search.

కోహ్లీ, రోహిత్.. ఆ రోల్స్ సెట్ చేసిన సల్మాన్

ఇండియన్ స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమ్ ఇండియాని బలంగా నడిపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   17 Oct 2023 2:30 PM GMT
కోహ్లీ, రోహిత్.. ఆ రోల్స్ సెట్ చేసిన సల్మాన్
X

ఇండియన్ స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమ్ ఇండియాని బలంగా నడిపిస్తున్నాడు. మన క్రికెటర్స్ కి మూవీ సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ అనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా పార్టీలలో క్రికెటర్స్ తో సినిమా స్టార్స్ కూడా మీట్ అవుతూ ఉంటారు. విరాట్ కోహ్లి బయోపిక్ లో నటించాలని ఉందంటూ గతంలో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ తన టైగర్ 3 మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో వీరిద్దరి గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు చేసిన సినిమాలలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకి సరిపోయే కథలు ఏంటి అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సల్మాన్ ఖాన్ సమాధానం చెప్పారు. ఇద్దరు మంచి ప్రతిభావంతులని సల్మాన్ ఖాన్ కొనియాడారు.

అయితే వారి క్యారెక్టర్ పరంగా చూసుకుంటే దబాంగ్ మూవీ విరాట్ కోహ్లికి కరెక్ట్ గా సెట్ అవుతుందని అన్నారు. అలాగే భజరంగీ భాయ్ జాన్ మూవీలోని పాత్ర రోహిత్ శర్మకి సరిపోతుందని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటాడని, నిబద్దతతో పని చేస్తాడని, అందుకే అతననంటే తనకి అభిమానం అని సల్మాన్ ఖాన్ చెప్పడం విశేషం.

కోహ్లీ ఫాలో అయ్యే వేల్యూస్ తనకిబాగా నచ్చుతాయని సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ని కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కోహ్లీ యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే స్టార్ హీరోగా మారిపోవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న స్పై థ్రిల్లర్ టైగర్ 3 నవంబర్ లో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ కత్రినా కైఫ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఈ ఏడాది పఠాన్ తర్వాత రాబోతోన్న మరో పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ టైగర్ 3 కావడం విశేషం. ఈ సినిమాతో మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఖాతాలో వేసుకోనివ్వాలని యష్ రాజ్ ఫిలిమ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది.