Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ తమిళ కాంబినేషన్లు.. చెలగాటమే..

ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే అసలు ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావడం లేదు.

By:  Tupaki Desk   |   12 March 2024 11:30 PM GMT
సల్మాన్ ఖాన్ తమిళ కాంబినేషన్లు.. చెలగాటమే..
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ కొట్టి చాలా కాలం అయింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే సల్మాన్ ఖాన్ మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. అప్పట్లో ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటు వచ్చాడు. కానీ కరోనాకాలం తర్వాత బాయ్ సినిమాల మార్కెట్ కూడా తగ్గుతూ వస్తోంది.

ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే అసలు ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావడం లేదు. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సొంత ఇండస్ట్రీలోని సక్సెస్ ఇచ్చిన దర్శకులను కూడా పెద్దగా నమ్మడం లేదు. ఎక్కువగా ఇప్పుడు కోలీవుడ్ దర్శకులం వైపు అతని ఫోకస్ పడినట్లుగా అర్థమవుతుంది. అయితే ఆ దర్శకుల టైం కూడా ప్రస్తుతం బాలేదు.

రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మురగదాస్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కిక్ 2 గా రాబోతున్న ఈ సినిమాను ఈద్ కానుకగా విడుదల చేయాలి అని ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ మురగదాస్ ను కూడా సక్సెస్ చూసి చాలాకాలమైంది. తమిళ్ ఇండస్ట్రీలో అతనితో ఇంతకుముందు బిగ్ సక్సెస్ లు చూసిన హీరోలు ఎవరు కూడా అంతగా ఆసక్తిని చూపలేదు.

ముఖ్యంగా విజయ్ అవకాశం ఇస్తానని చివరికి కథ నచ్చకపోవడంతో సైలెంట్ గానే ఆ ప్రాజెక్టును క్లోజ్ చేసేసారు. ఇక చివరకు మురగదాస్ స్టార్ హీరోల రేంజ్ నుంచి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కిక్ 2 సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.

సల్మాన్ ఖాన్ అయితే ఈ దర్శకుడిని గట్టిగానే నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ మురగదాస్ కంటే ముందే తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అదే బిగ్ బుల్ సినిమా. విష్ణువర్ధన్ ఒకప్పుడు తమిళంలో అజిత్ తో బిల్లా, ఆరంభం లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. పవన్ తో పంజా కూడా చేశాడు. కానీ ఆ తర్వాత అతను మళ్ళీ సరైన సక్సెస్ చూడలేదు.

రెండు ఏళ్ళ క్రితం బాలీవుడ్లో షేర్షా అనే సినిమా తీయగా అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇతనికి బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేనప్పటికీ సల్మాన్ ఖాన్ గట్టిగానే నమ్ముతున్నాడు. ఏదేమైనా వారి పాత పద్ధతిలో కాకుండా నేటితరంకు కనెక్ట్ అయ్యే కొత్త తరహా కథలతో వస్తే బాగుంటుంది. మరి తమిళ దర్శకులు నమ్ముకున్న సల్మాన్ ఖాన్ వారికి సక్సెస్ ఇచ్చి తన మార్కెట్ ను మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాడో లేదో చూడాలి.