Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. ఆ హీరో జైల్లో టాయ్‌లెట్లు క‌డిగాడా?

అత‌డు ప‌రిశ్ర‌మ అగ్ర హీరో. ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీని ఏలాడు. ఇప్ప‌టికీ ఏల్తూనే ఉన్నాడు

By:  Tupaki Desk   |   15 Aug 2023 6:29 AM GMT
#గుస‌గుస‌.. ఆ హీరో జైల్లో టాయ్‌లెట్లు క‌డిగాడా?
X

అత‌డు ప‌రిశ్ర‌మ అగ్ర హీరో. ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీని ఏలాడు. ఇప్ప‌టికీ ఏల్తూనే ఉన్నాడు. కానీ అత‌డు గ‌తంలో జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న‌ప్పుడు టాయ్ లెట్లు కూడా క‌డిగాడు. జైలు వెలుప‌ల ఉన్న అత‌డిని ఇప్పుడు మాఫియా చంపేస్తామ‌ని కూడా బెదిరిస్తోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. అత‌డి రియ‌ల్ లైఫ్ స్టోరి గురించి తెలిసిన ఎవ‌రైనా వెంట‌నే 'స‌ల్మాన్ ఖాన్' అని సులువుగా చెప్పేయ‌గ‌ల‌రు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాలిటీ షో వేదిక‌గా చెప్పిన ఓ సంగ‌తి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాస్పద రియాలిటీ షో 'బిగ్ బాస్ OTT 2' రెండవ సీజన్ కు అత‌డు హోస్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ సోమవారం రాత్రితో ముగిసింది. ఎల్విష్ యాదవ్‌ను హోస్ట్ స‌ల్మాన్ విజేతగా ప్రకటించాడు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా.. భాయ్ స్ఫూర్తివంత‌మైన క్లాస్ ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. సృష్టిలో ఏ పని చిన్నది లేదా పెద్దది కాదని భాయ్ పేర్కొన్నాడు. జైలుకి వెళ్లిన‌ప్పుడు అలాగే బోర్డింగ్ పాఠశాలలో చ‌దువుకున్న‌ప్పుడు తాను టాయిలెట్లను శుభ్రం చేసిన విష‌యాన్ని గుర్తుచేసుకున్నాడు.

'బిగ్ బాస్ OTT 2'లో పోటీదారులలో ఒకరైన పూజా భట్ గ్రాండ్ ఫినాలే నుంచి ఎలిమినేట్ అయింది. అయితే శుభ్ర‌త‌పై ఆమె క‌మిట్ మెంట్ ని ప్ర‌శంసిస్తూ.. సల్మాన్ తన గ‌తాన్ని స్వీయ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచంలోని ఏ పనీ అల్పమైనదిగా పరిగణించకూడదని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా అతడు విలువైన సలహా ఇచ్చాడు. తాను జైలులో టాయిలెట్లు శుభ్రం చేసిన విషయాన్ని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. ఇంటి స‌భ్యురాలు పూజా బహిష్కరణను ప్రకటించిన సల్మాన్ 'బిగ్ బాస్ OTT 2' హౌస్‌లోని టాయిలెట్‌లు, బాత్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచడం పట్ల ఆమెకున్న అమితాసక్తిని మెచ్చుకున్నాడు.

బిగ్ బాస్ గత సీజన్లలో కంటెస్టెంట్లకు గుణపాఠం చెప్పేందుకు తానే స్వయంగా ఇంట్లోకి ప్రవేశించి టాయిలెట్లను శుభ్రం చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్‌లోని వాష్‌రూమ్‌లను సీజన్‌లో పూజ ఎంతో ప‌రిశుభ్రంగా ఉంచింద‌ని .. బిగ్ బాస్ లో తాను ఎప్పుడూ వాటిని అలా చూడలేదని స‌ల్మాన్ చెప్పాడు. తాను జైలులో ఉన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ చదువుతున్న రోజుల్లో కూడా మరుగుదొడ్లను ఎలా శుభ్రం చేశాడో ప్రస్తావించాడు. కృష్ణజింకలను వేటాడిన కేసు స‌హా .. హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడే వరకు సల్మాన్ చాలా రోజులు జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డిన అత‌డికి జైపూర్ కి చెందిన మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ కి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ముంబై పోలీసులు ఏర్పాటు చేసారు.

బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత‌

బిగ్ బాస్ OTT 2 గ్రాండ్ ఫినాలే ఆగస్టు 14 సోమవారం జరిగింది. ట్రోఫీ కోసం పోరాడిన మొదటి ఇద్దరు పోటీదారులు అభిషేక్ మల్హాన్ -ఎల్విష్ యాదవ్ ఇద్ద‌రూ ఫైనలిస్టులు కాగా.. చివ‌రికి స‌ల్మాన్ విజేత‌ను ప్ర‌క‌టించారు. సరదాలు, పరిహాసాలు ప్రదర్శనలతో నిండిన ఆ రాత్రి ఫలితం ప్రకటించడానికి సల్మాన్ ఎంతో ఆస‌క్తిగా విచ్చేయ‌గా టీవీక్ష‌కుల్లో ఒక‌టే ఉత్కంఠ‌. చివ‌రికి ఎల్విష్ 'బిగ్ బాస్ OTT 2' విజేతగా నిలిచాడు. షో చరిత్రలో ట్రోఫీని గెలుచుకున్న మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అతడు నిలిచాడు.