Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ ఖాన్ ఉడ‌క‌బెట్టిన బంగాళ దుంపా!

సల్మాన్ బ్లూ షర్ట్ మరియు బ్లాక్ ప్యాంట్‌లో న్యూ లుక్‌లో కనిపించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ లావుగా.. అన్ ఫిట్ గా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:59 AM GMT
స‌ల్మాన్ ఖాన్ ఉడ‌క‌బెట్టిన బంగాళ దుంపా!
X

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఫిట్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌రిశ్ర‌మ‌లో కండ‌గండ‌డుగా పేరు గాంచిన న‌టుడు. మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తాడు. రింగిలు తిరిగిన బాడీ..మెలి తిరిగిన కండ‌ల‌తో ఎంతో ఫిట్ గా క‌నిపిస్తాడు. అవ‌స‌ర‌మైతే సిక్స్ ప్యాక్ లుక్ లో సునాయాసంగా ట్రాన్స‌ప‌ర్మేష‌న్ కాగ‌ల‌డు. 60 కి చేరువ‌లో ఉన్నా అదే ర‌క‌మైన ఫిజిక్ ని మెయింటెన్ చేస్తున్న న‌టుడు.

ఈవిష‌యంలో రామ్ చ‌ర‌ణ్..రానా స‌హా ఎంతో మంది న‌టుల‌కు ఓ ఇనిస్పేరేష‌న్. అలాంటి స‌ల్మాన్ ఖాన్ ఇప్పుడెలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నాడో తెలుసా? ఒక‌రు ఉడ‌క‌బెట్టిన బంగాళ దుంప అంటున్నారు? ఇంకొకడు పొట్ల కాయ‌లా ఉబ్బాడు? అంటున్నారు. అవును ఇవ‌న్నీ సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌ల్మాన్ కొత్త ఫోటోలపై నెట్టింట జ‌రుగుతోన్న చ‌ర్చ‌.

వివ‌రాల్లో వెళ్లే.. సల్మాన్ ఖాన్.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో కలిసి ఆయుష్ శర్మ మరియు అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో జరిగిన గణపతి వేడుకల్లో పాల్గొన్నారు. సల్మాన్ బ్లూ షర్ట్ మరియు బ్లాక్ ప్యాంట్‌లో న్యూ లుక్‌లో కనిపించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ లావుగా.. అన్ ఫిట్ గా ఉన్నాడు. శ‌రీరం ఉబ్బిన‌ట్లు.. పొట్ట బాగా ముందుకొచ్చినట్లు.. చొక్కా బొత్తాలు తెగిపోవడానికి రెడీగా ఉన్న‌ట్లు... ముఖం లో మార్పులు... గ్లో త‌గ్గ‌డం అన్నింటా మార్పు గ‌మ‌నించ‌వచ్చు.

స‌ల్మాన్‌ ఇలా అయిపోయాడేంట‌ని వేడుక వ‌ద్ద గుస‌గుస‌లాడ‌కున్నారు. దీంతో నెట్టింట కామెంట్లు షురూ అయ్యాయి. ఓ నెటిజ‌నుడు ఇలా రాసాడు 'షారుఖ్ ఖాన్ 'పఠాన్' - 'జవాన్' విజయం సల్మాన్ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిందని...మరొక షారుక్ అభిమాని 'జవాన్' కలెక్షన్లు అతనిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. త్వరగా కోలుకోండి భాయ్ అని రాసుకొచ్చారు. ఇంకా చాలా మంది తన స్టైలిస్ట్ మరియు డైటీషి యన్‌ను మార్చమని సలహా ఇచ్చారు.

అదే సమయంలో మ‌రికొంత మంది స్టెరాయిడ్స్ తీసుకోవడం మానేయాలని కోరారు. సల్మాన్ ఉడకబెట్టిన బంగాళాదుంపలా కనిపిస్తే.. అతని రాబోయే చిత్రాలైన 'టైగర్ 3' -కరణ్ జోహార్ చిత్రాలలో అతని లుక్ గురించి సల్మాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్క్ ఫ్రంట్‌లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో న‌టిస్తున్నాడు. ఈ యాక్ష‌న చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.