రష్మిక కోసం కార్ డోర్ తీసి పద్ధతిగా సల్మాన్
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 1 April 2025 1:04 AM ISTసికందర్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపాడు సల్మాన్ ఖాన్. ఇటీవల భాయ్ కి అస్సలు టైమ్ లేదు. మరోవైపు రష్మికతో పాటు అతడు ప్రచార హంగామా సృష్టించాడు. అయితే ఈ షెడ్యూళ్ల నడుమ రష్మిక తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు రష్మిక మందన్నకు హగ్ ఇచ్చి, ఆమె కోసం కారు తలుపు తెరిచి తన వినమ్రతను చాటుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికందర్ భారీ మాస్ యాక్షన్ చిత్రం. ఈ చిత్రానికి విమర్శకులు - అభిమానుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. సల్మాన్ భాయ్ కి ఇది ఊహించని షాక్. అయినా భాయ్ స్టార్ డమ్ దృష్ట్యా ఆరంభ వసూళ్లకు కొదవేమీ లేదని ట్రేడ్ చెబుతోంది.
ఒక సమావేశం నుంచి తిరిగి వస్తూ.... సల్మాన్ కలీనా విమానా శ్రయం నుంచి కట్టు దిట్టమైన సెక్యూరిటీ నడుమ వెలుపలికి చేరుకున్నాడు. అదే సమయంలో రష్మికకు తగిన భద్రతను భాయ్ కల్పించాడు. తన కార్ డోర్ తెరిచి సాగనంపాడు. కారులోకి ప్రవేశించే ముందు, రష్మిక సల్మాన్ ఖాన్‌ను ముద్దుగా కౌగిలించుకుంది. అభిమానులు ఆ ఇద్దరి కోసం వేచి ఉండగా, సల్మాన్ ఖాన్ వీడ్కోలు పలికే ముందు వారు కెమెరాల కోసం కలిసి పోజులిచ్చారని కూడా తెలుస్తోంది.
