Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకు మెద‌డు న‌రాలు ఉబ్బిపోయే రుగ్మ‌త‌

ఇవ‌న్నీ వినేందుకే భ‌యాన‌కంగా ఉన్నాయి. కానీ వీటిని అనుభ‌వించే వ్య‌క్తి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

By:  Tupaki Desk   |   22 Jun 2025 2:30 PM
స్టార్ హీరోకు మెద‌డు న‌రాలు ఉబ్బిపోయే రుగ్మ‌త‌
X

మెద‌డులో ఒక చోట నాళం ఉబ్బిపోయి తీవ్రంగా నొప్పి పెట్ట‌డం.. స‌డెన్ గా ముఖానికి ఒక వైపున‌ క‌రెంట్ షాక్ కొట్టిన భావ‌న‌కు లోన‌వ్వ‌డం.. ప‌క్క‌టెముక‌లు విరిగిపోయిన ఫీలింగ్.. ఆత్మ‌హ‌త్యా ఆలోచ‌న‌... ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఎవ‌రిలో ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం.

ఇవ‌న్నీ వినేందుకే భ‌యాన‌కంగా ఉన్నాయి. కానీ వీటిని అనుభ‌వించే వ్య‌క్తి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఊహ‌కంద‌ని ఈ స‌మ‌స్య‌ల‌న్నిటినీ భ‌రిస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు.. బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్. అత‌డు ఎవ‌రూ ఊహించ‌ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షోలో వెల్ల‌డించాడు.

గ్లామ్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచంలో అత‌డు ఎంతో హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడ‌ని అంతా అనుకుంటారు. అందాల క‌థానాయిక‌ల‌తో రొమాన్స్ చేస్తూ, బ్యాచిల‌ర్ లైఫ్ ని అలా కానిచ్చేస్తున్నాడ‌ని కూడా ఊహిస్తారు. కానీ ప్ర‌తి మ‌నిషికి ఏదో ఒక టైమ్ లో స‌ర‌దా తీరిపోతుంద‌ని పూరి జ‌గ‌న్నాథ్ చెప్పిన‌ట్టు, స‌ల్మాన్ భాయ్ కి కూడా తీరిపోతోంద‌ని అత‌డు చెప్పిన దానిని బ‌ట్టి అంచ‌నా వేయొచ్చు.

ట్రిజెమినల్ న్యూరల్జియా, AV వైకల్యంతో బాధపడుతున్నట్లు సల్మాన్ ఖాన్ వెల్ల‌డించాడు. ట్రిజెమినల్ న్యూరల్జియా, బ్రెయిన్ అనూరిజం మ‌రియు ఏవి వైకల్యం అనే తీవ్రమైన వైద్య పరిస్థితులతో జీవించడం.. ఇంత‌టి క‌ష్టంలోను సినిమాల‌కు పనిచేయడం గురించి స‌ల్మాన్ ఎలాంటి భేష‌జం లేకుండా మాట్లాడాడు. పక్కటెముకలు విరిగిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా కానీ పరిశ్రమలో కష్టపడి పనిచేస్తూనే ఉన్నానని స‌ల్మాన్ చెప్పాడు. అత‌డికి ఉన్న ఒక అనారోగ్య‌ స‌మ‌స్య కార‌ణంగా ప్ర‌తి రోజు - పక్కటెముకలు విరిగిపోతాయి.. నేను ట్రైజెమినల్ న్యూరల్జియాతో బాధప‌డుతూ కూడా పని చేస్తున్నాను.. మెదడులో అనూరిజం ఉంది.. నేను ఇంకా ఏవీ వైకల్యంతో పని చేస్తున్నానని స‌ల్మాన్ చెప్పాడు. మెద‌డులో న‌రాలు చిట్లిపోయి స్ట్రోక్ వ‌చ్చేంత తీవ్ర‌మైన ప‌రిస్థితులు త‌న‌కు ఎదుర‌వ్వొచ్చ‌ని కూడా స‌ల్మాన్ వెల్ల‌డించాడు.