Begin typing your search above and press return to search.

ఆస్తి పంప‌కంపై సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ఆస్తుల పంపిణీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు ఓ వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   24 April 2026 11:00 PM IST
ఆస్తి పంప‌కంపై సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం?
X

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ఆస్తుల పంపిణీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు ఓ వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని తన సోదర సోదరీమణులకు సమానంగా పంచివ్వాలని నిశ్చయించుకున్నారట. 60 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న సల్మాన్, తన తర్వాత తన కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు పంపిణీకి శ్రీకారం చుట్టారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఆకస్మిక నిర్ణయానికి ఆయన గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణమని అంటున్నారు.

సల్మాన్ ఖాన్ గతంలో ట్రైజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన అత్యంత బాధాకరమైన నరాల వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. దీనిని సూసైడ్ డిసీజ్ అని కూడా అంటారు. ఆ సమయంలో ఆయన అనుభవించిన నరకయాతన వల్ల జీవితంపై విరక్తి కలిగిందని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం స‌ల్మాన్ ఖ ఆన్ ఆరోగ్యంగానే బాగానే ఉన్నా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ 2026 నాటికి సుమారు 3225 కోట్లుగా అంచనా వేయబడింది.

బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్, పన్వెల్‌లోని 80 కోట్ల విలువైన ఫామ్‌హౌస్, ఇంకా పలు వ్యాపారాలు , బ్రాండ్ల ద్వారా ఆయన ఈ సంపదను ఆర్జించారు. ఈ భారీ సామ్రాజ్యాన్ని తన తమ్ముళ్ళు అర్బాజ్, సోహైల్ , సోదరీమణులు అర్పిత, అల్విరా ల‌కు సమానంగా పంచాలని భావిస్తున్నారట. కుటుంబం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు ఇది నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు. సల్మాన్ ఖాన్ తీసుకున్నట్లుగా చెబుతున్న ఈ నిర్ణయంపై ఆయన కుటుంబం నుండి కానీ, ఇటు అధికారిక ప్రతినిధుల నుండి కానీ ఇంకా స్పష్టత రాలేదు.

స‌ల్మాన్ ఖాన్ దాతృహృద‌యం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సంప‌ద‌లో చాలా భాగం చారిటీల‌కే కేటాయిస్తారు. అనాధ పిల్ల‌ల‌ను చ‌దివించ‌డం, అనారోగ్యానికి గురైన వారికి ఆసుప‌త్రిలో సేవ‌లందించ‌డం ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఎంత సంపాదించినా? డ‌బ్బు ఏనాడు త‌న‌కి సంతృప్తినివ్వ‌లేద‌ని సేవ‌లో అస‌లైన సంతృప్తి దొరుకుతుంద‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం స‌ల్మాన్ ఖాన్ `మాతృభూమి` సినిమాలో న‌టిస్తున్నారు. దేశ భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. గ్వాల్వానా ఘ‌ట‌న ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు పాత్ర‌లోనే స‌ల్మాన్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.