బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్.. జవాబివ్వలేక దొరికిపోయిన సల్మాన్
నిజానికి ఈ ప్లేస్ నుంచే సల్మాన్ ఖాన్ తనను చూడటానికి వచ్చిన అభిమానులకు హాయ్ చెప్పి పలకరిస్తుంటాడు.
By: Tupaki Desk | 25 July 2025 6:00 AM ISTగ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ నుంచి తీవ్రమైన బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే పలుమార్లు బిష్ణోయ్ అతడిపై హత్యాయత్నం చేసాడు. అదృష్టవశాత్తూ సల్మాన్ తప్పించుకున్నాడు. ముఖ్యంగా ముంబైలోని సల్మాన్ నివాసం గ్యాలాక్సీపై కాల్పుల అనంతరం అతడి చుట్టూ పరిసరాల్లో హై అలెర్ట్ నెలకొంది.
ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ గేలాక్సీ చుట్టూ రెక్కీ నిర్వహించిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు అతడి బాల్కనీపైకి తుపాకులతో కాల్పులు జరపగా ఆ సమయంలో సల్మాన్ కుటుంబీకులు తీవ్రంగా భయకంపితులయ్యారు. తెల్లవారుఝామున జరిగిన ఘటనలో అదృష్టవశాత్తూ సల్మాన్ కి కానీ, అతడి కుటుంబీకులకు కానీ ఏమీ జరగలేదు. కానీ ఆ కుటుంబంలో తీవ్రమైన భయాందోళనలు మొదలయ్యాయి. అటుపై సల్మాన్ ఇంటి చుట్టూ భద్రతను పెంచారు ముంబై పోలీస్. అలాగే సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీని పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ తో బంధించాడు. లోనికి బుల్లెట్లు కూడా చొచ్చుకు రానంత పకడ్భందీగా ఈ ఏర్పాటు చేసుకున్నాడు.
నిజానికి ఈ ప్లేస్ నుంచే సల్మాన్ ఖాన్ తనను చూడటానికి వచ్చిన అభిమానులకు హాయ్ చెప్పి పలకరిస్తుంటాడు. కానీ దానిని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ తో మూసి వేయడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. తాజా ఇంటర్వ్యూలో ఈ ఏర్పాటు గురించి సల్మాన్ ని మీడియా ప్రశ్నించింది. అయితే దీనికి సల్మాన్ రెస్పాన్స్ ఊహించని విధంగా ఉంది. ఫ్యాన్స్ ఆ బాల్కనీ వద్ద వేచి చూస్తారని, తనను కలిసేందుకు లోనికి వచ్చేస్తారేమోననే భయంతోనే ఆ ఏర్పాటు చేసుకున్నానని తెలిపాడు. ``అభిమానులు పైకి ఎక్కి తనను కలవడానికి అక్కడే ఉంటారు. వారు అక్కడే నిద్రపోవడం కూడా చూసాను.. అందువల్ల ఇంట్లో అందరి భద్రత కోసం బాల్కనీని కప్పివేసాము`` అని తెలిపాడు. ప్రతియేటా ఈద్ పండగకు అభిమానులను కలిసేందుకు సల్మాన్ ఇక్కడికే వస్తుంటారు. కానీ ఇప్పుడు కుదరదు.. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. సల్మాన్ భాయ్ సికందర్ తర్వాత గాల్వన్ లోయ ఘర్షణ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం భాయ్ తన రూపాన్ని మార్చుకుంటున్నారు.
