ఇంట్లోకి జొరబడ్డ అపరిచితుడు.. డేంజర్‌లో స్టార్ హీరో!
అయితే వై - ప్లస్ కేటగిరీ భద్రత కూడా సల్మాన్ ని కాపాడలేదని తాజా పరిణామం చెబుతోంది. తాజా ఇన్సిడెంట్‌లో సల్మాన్ ఇంట్లోకి ఒక అపరిచితుడు ప్రవేశించాడు.
By: Tupaki Desk | 22 May 2025 3:24 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పగబట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్ ని చంపేస్తామని పదే పదే జైలు నుంచే అతడు హెచ్చరికలు పంపుతున్నాడు. గత ఏడాది ముంబై గ్యాలాక్సీ భవంతిలో నివశిస్తున్న సల్మాన్ కుటుంబీకులపై లారెన్స్ అనుచరులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఆ తర్వాత అతడికి వై- ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది.
అయితే వై - ప్లస్ కేటగిరీ భద్రత కూడా సల్మాన్ ని కాపాడలేదని తాజా పరిణామం చెబుతోంది. తాజా ఇన్సిడెంట్‌లో సల్మాన్ ఇంట్లోకి ఒక అపరిచితుడు ప్రవేశించాడు. అతడు సెక్యూరిటీ అధికారుల కనుగప్పి లోనికి ప్రవేశించడం కలకలం రేపింది. అతడు చాలా సేపు భవంతి చుట్టూ రెక్కీ చేసాడు. ఆ తర్వాత లోనికి వెళ్లాలని చూస్తే సెక్యూరిటీ ఆపాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొంత సేపటికి గేలాక్సీ లోకి ప్రవేశించిన ఓ కార్ లో దొంగచాటుగా లోనికి ప్రవేశించాడు. కానీ అక్కడ పోలీస్ ఒకరు అతడిని ఆపారు. అతడు చెప్పినా వినకుండా, అనుమతి లేకుండా దొంగచాటుగా లోనికి ప్రవేశించగా, పోలీసులకు అప్పగించారని తెలుస్తోంది.
అయితే పోలీసులు అతడిని ప్రశ్నించగా తాను సల్మాన్ ఖాన్ ని కలవాలనుకున్నానని, కానీ లోనికి వెళ్లనీయకుండా ఆపేయడంతో దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించానని అతడు చెప్పాడు. నిందితుడి పేరు జితేందర్ సింగ్. వయసు 23. ప్రస్తుతానికి పోలీసులు అతడిపై కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు. ఇందులో కుట్ర కోణం ఏదైనా ఉందా? అన్నది పోలీసులు వెల్లడించాల్సి ఉంది. అయితే అతడి వల్ల తక్షణం ప్రమాదం లేకపోయినా కానీ, సల్మాన్ కి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ డొల్లతనం బయటపడింది. ఈ తరహా సెక్యూరిటీ వల్ల ఎలాంటి రక్షణా లేదని ప్రూవైంది. సల్మాన్ ని చంపేందుకు తన అనుచరుల్ని రిపీటెడ్ గా పంపిస్తున్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ కి దొరికిపోవడం పెద్ద కష్టమేమీ కాదని ప్రూవైంది. సల్మాన్ ని కార్ బాంబ్ పేల్చి చంపేస్తామని ఒకసారి గ్యాంగ్ స్టర్ అనుచరులు బెదిరించాడు. మరోసారి సల్మాన్ ఫామ్ హౌస్ లో రెక్కీ చేసి, చిన్న పిల్లలకు తుపాకులిచ్చి కాల్చి చంపించేయాలని ప్లాన్ చేసారు. కానీ అదృష్టవశాత్తూ ఇవేవీ వర్కవుట్ కాలేదు. కేసులో సీరియస్ నెస్ ని బట్టి సల్మాన్ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బిష్ణోయ్ కమ్యూనిటీ దైవంగా భావించి ఆరాధించే కృష్ణ జింకల్ని చంపిన సల్మాన్ ని గ్యాంగ్ స్టర్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. సైఫ్ ఇంట్లోకి జొరబడిన దుండగుడు కత్తి పోట్లతో విరుచుకుపడ్డాడు. సల్మాన్ ఖాన్ ఇంట్లోను ఇప్పుడు అపరిచితుడు ప్రవేశించడం గుబులు పుట్టించింది.
