Begin typing your search above and press return to search.

పోస్ట్ లైక్ చేస్తే సినిమా చేస్తున్న‌ట్టేనా?

అలాంటిది సల్మాన్ పోస్ట్ ను లైక్ చేయ‌డంతో వీరిద్ద‌రూ క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నార‌ని అందుకే సందీప్, స‌ల్మాన్ పోస్ట్ ను లైక్ చేశాడ‌ని వార్త‌లు పుట్టుకొచ్చాయి.

By:  Tupaki Desk   |   30 April 2025 9:53 PM IST
పోస్ట్ లైక్ చేస్తే సినిమా చేస్తున్న‌ట్టేనా?
X

గ‌త కొంత‌కాలంగా స‌ల్మాన్ ఖాన్ చేస్తున్న ప్ర‌తీ ప్ర‌య‌త్నం బెడిసి కొడుతుండ‌టంతో ఫ్యాన్స్ ఆయ‌న తిరిగి ఎప్పుడెప్పుడు కంబ్యాక్ ఇస్తాడా అని ఎంతో ఆశ‌గా ఎదురుచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్, సందీప్ రెడ్డి వంగా క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం సందీప్ రెడ్డి వంగా ఇన్‌స్టాలో స‌ల్మాన్ పోస్ట్ ను లైక్ చేయ‌డ‌మే.

మామూలుగా సందీప్ ఇన్‌స్టాలో ఏ పోస్టులూ లైక్ చేయ‌డు. అలాంటిది సల్మాన్ పోస్ట్ ను లైక్ చేయ‌డంతో వీరిద్ద‌రూ క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నార‌ని అందుకే సందీప్, స‌ల్మాన్ పోస్ట్ ను లైక్ చేశాడ‌ని వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఒక‌వేళ ఇది జ‌రిగితే మాత్రం స‌ల్మాన్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుంద‌ని కూడా ఫ్యాన్స్ అప్పుడే ఎనాలసిస్ లు చేస్తున్నారు.

కానీ స‌ల్మాన్- సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ ఇప్ప‌ట్లో కుదిరే ప‌ని కాద‌ని తెలిసిందే. దానికి కార‌ణం సందీప్ ఆల్రెడీ ప‌లు ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టుకుని వాటిపై ఫోక‌స్ చేస్తున్నాడు. ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో స్పిరిట్ చేయ‌నున్న సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా త‌ర్వాత ర‌ణ్‌బీర్ క‌పూర్ తో క‌లిసి యానిమ‌ల్ పార్క్ ను చేయాల్సి ఉంది.

ఈ రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. వాటి త‌ర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయాల‌ని చూస్తున్న సందీప్, ఈ లైనప్ మొత్తాన్ని ఫినిష్ చేయాలంటే ఎంత‌లేద‌న్నా నాలుగైదు సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఇంతటి బిజీ షెడ్యూల్ లో సందీప్, స‌ల్మాన్ ఖాన్ తో సినిమా చేయ‌డం అసాధ్య‌మ‌నే చెప్పాలి.

అంతేకాదు సందీప్ లాంటి స్ట్రిక్ట్ డైరెక్ట‌ర్ తో వ‌ర్క్ చేయ‌డం సల్మాన్ కు కూడా క‌ష్ట‌మే. దానికి తోడు స‌ల్మాన్ రీసెంట్ సినిమాల‌న్నీ ఫ్లాపులైన నేప‌థ్యంలో స‌ల్మాన్ తో వ‌ర్క్ చేయ‌డానికి అస‌లు సందీప్ ఇంట్రెస్ట్ చూపిస్తాడా లేదా అన్న‌ది కూడా అనుమాన‌మే. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో స‌ల్మాన్- సందీప్ క‌ల‌యిక‌లో సినిమా రానుంద‌ని వ‌స్తున్న వార్త‌లు పుకార్ల‌నే అనుకోవాలి. అన్నీ బావుండి ఈ ఇద్ద‌రూ ఫ్యూచ‌ర్ లో ఏదైనా సినిమా చేస్తారేమో చూడాలి.