Begin typing your search above and press return to search.

విడాకులు తీసుకుని మీ స‌గం డ‌బ్బుతో వెళుతుంది: స్టార్ హీరో

''విడాకులు చిన్న అపార్థాల వల్ల జరుగుతాయి. ఆపై ఆమె మీ సగం డబ్బుతో వెళ్ళిపోతుంది!'' అంటూ స‌ల్మాన్ జోక్ వేసాడు స‌ల్మాన్.

By:  Tupaki Desk   |   15 Jun 2025 7:00 AM IST
విడాకులు తీసుకుని మీ స‌గం డ‌బ్బుతో వెళుతుంది: స్టార్ హీరో
X

ష‌ష్ఠిపూర్తి వ‌య‌సు వ‌చ్చినా ఇంకా అత‌డు ఎలిజిబుల్ బ్యాచిలర్. చాలా మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్ లైఫ్ లోకి వచ్చి వెళుతున్నారు. వేరొకరిని పెళ్లాడి సెటిల‌వుతున్నారు. కానీ ఈ సీనియ‌ర్ బ్యాచిల‌ర్ మాత్రం ఇంకా పెళ్లిపై జోకులు వేస్తూ ప‌బ్బం గ‌డిపేస్తున్నాడు. ఇప్పుడు కూడా పెళ్లి బంధం గురించి మాట్లాడాడు. అటుపై విడాకుల‌కు కార‌ణ‌మేంటో కూడా చెప్పాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ ఖాన్.

''విడాకులు చిన్న అపార్థాల వల్ల జరుగుతాయి. ఆపై ఆమె మీ సగం డబ్బుతో వెళ్ళిపోతుంది!'' అంటూ స‌ల్మాన్ జోక్ వేసాడు స‌ల్మాన్. చాలా జంట‌లు చిన్న గొడ‌వ‌ల‌కే విడిపోతున్నాయి. భార్యా, భ‌ర్త‌ల మ‌ధ్య‌ ప‌ట్టు విడుపు లేదు. ఒక‌ప్ప‌టిలా ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డం లేదు. వెంట‌నే విడాకులు తీసుకుంటున్నారని స‌ల్మాన్ భాయ్ నిర్వేదం వ్య‌క్తం చేసాడు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' మూడో సీజ‌న్ లో స‌ల్మాన్ తో ఆస‌క్తిక‌ర ఎపిసోడ్ ఉంది. జూన్ 21 రాత్రి 8 గంటలకు ప్రీమియర్ కానుంది. ఇందులో స‌ల్మాన్ తో క‌పిల్ చిట్ చాట్ అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తోంది.

పూర్తి ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు. ఇంత‌లోనే సల్మాన్ ఖాన్ కనిపించిన క్లిప్ ఇప్పటికే వైరల్ కావ‌డంతో ఆన్‌లైన్‌లో చాలా చర్చలకు దారితీసింది. ఈ వీడియోలో విడాకులు, భరణం అనే టాపిక్‌పై సల్మాన్ -కపిల్ మ‌ధ్య సంభాష‌ణ‌లు హైలైట్ గా నిలిచాయి. విడాకులు చిన్న అపార్థాల వల్ల జరుగుతాయి. ఆపై ఆమె మీ సగం డబ్బుతో వెళ్ళిపోతుంది! అంటూ స‌ల్మాన్ జోక్ వేసాడు. ఈ జోక్ నిజంగా భార‌తీయ వివాహ వ్య‌వ‌స్థ‌తో స‌మ‌స్య ఏంటో చూపించింది. తాను పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, కానీ త‌న గాళ్ ఫ్రెండ్స్ త‌న‌తో సంతోషంగా ఉండ‌లేమ‌ని భావించ‌డం వ‌ల్ల కుద‌ర‌లేద‌ని కూడా గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో స‌ల్మాన్ నిజాయితీగా వ్యాఖ్యానించాడు. వారి త‌ప్పేమీ లేదు... అంతా నా త‌ప్పేన‌ని స‌ల్మాన్ అంగీక‌రించాడు.