జాలి గుణంతోనే స్టార్ హీరోకి చెడు జరుగుతోంది!
జాలి..దయ.. కరుణ.. ధాతృహృదయం లాంటి పదాలు వినేందుకు ఎంతో బావుంటాయి. కానీ వాటిని ఆచరించేందుకు గొప్ప వ్యక్తిత్వం కావాలి.
By: Tupaki Desk | 4 May 2025 9:30 AMజాలి..దయ.. కరుణ.. ధాతృహృదయం లాంటి పదాలు వినేందుకు ఎంతో బావుంటాయి. కానీ వాటిని ఆచరించేందుకు గొప్ప వ్యక్తిత్వం కావాలి. అలాంటి సహృదయత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఉందని అతడితో కలిసి పని చేసిన కొందరు నటులు కితాబిచ్చారు. అయితే ఇటీవల సల్మాన్ కెరీర్ వైఫల్యంపై విమర్శలు వస్తున్నవేళ.. అతడి ఎంపికలలోని లోపాల్ని ఎత్తి చూపుతున్నారు.
సల్మాన్ వరస పరాజయాల వెనక కారణం చెత్త ఎంపికలు అన్న విమర్శలొస్తున్నాయి. అయితే దీనిని సహనటుడు షెహజాద్ ఖండించారు. సల్మాన్ తనను సాయం కోరిన వారి కోసం ఏదైనా చేస్తాడు. తన ప్రాజెక్టులో చేర్చుకుంటాడు. అలా ఇటీవల అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ఓ నటుడు భాయ్ నాకు పని లేదు! అని అడిగాడు. వెంటనే తన సికందర్ లో నటించే అవకాశం కల్పించాడు. కష్టంలో ఉన్నవారికి పని కల్పించేందుకు ఒక్కోసారి తన సినిమాల మేకింగ్‌లోను సర్ధుబాట్లు చేసి రాజీ పడతాడని కూడా షెహజాద్ అన్నారు. ఉదాహరణకు .. తనకు పని లేదని చెప్పిన ఒకరికి సికందర్ లో నటించమని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఇది అతడి మంచితనానికి ప్రతీక అని అన్నారు.
ఇక సల్మాన్ పనైపోయింది అనే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు షెహజాద్. అర్థంపర్థం లేని విమర్శలు అని కూడా అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సాయపడే స్టార్ ని గుర్తించాలని కూడా అన్నారు. అంతగా అవకాశాల్లేని శర్మన్ జోషికి సల్మాన్ తన సికందర్ లో అవకాశం కల్పించాడు. కానీ అది డిజాస్టర్ అవ్వడంతో దానిపైనా నెటిజనులు ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ ప్రస్తుత ట్రెండ్ ని అనుసరించకపోవడం వల్ల కూడా ఫ్లాపులు ఎదురవుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. అతడు సైన్స్ ఫిక్షన్ సినిమాలు, చారిత్రక కథాంశాలు, ఫాంటసీ కథల్ని ఎందుకు టచ్ చేయడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.