ఈసారి బాలీవుడ్ యుద్దం చైనాతో!
సల్మాన్ ఖాన్ కథనాయకుడిగా అపూర్వ లాఖియా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 8:00 PM ISTసల్మాన్ ఖాన్ కథనాయకుడిగా అపూర్వ లాఖియా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సికిందర్ ప్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ మళ్లీ ప్లాప్ డైరెక్టర్ ని ఎంచుకున్నాడు? ఏంటి అనే విమర్శ కూడా వ్యక్తమైంది. పైగా అపూర్వా లాఖియా సినిమా చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఫాం కోల్పోయిన అతడితో సినిమా ఏంటని విమర్శలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ విమర్శలన్నింటి సరైన బధులు దొరికేలా ఉంది.
ఎందుకంటే సల్మాన్-అపూర్వ ద్వయం ఎంచుకున్న కథాంశం అలాంటింది. ఏకంగా ఓ పెద్ద వార్ చిత్రాన్నే ప్లాన్ చేసారు. వార్ అంటే సాధారణంగా పాకిస్తాన్ కథలు గుర్తుకొస్తాయి. కానీ ఈ ద్వయం మాత్రం చైనా వార్ ను తీసుకుంది. ఐదేళ్ల క్రితం జరిగిన గాల్వాన్ లోయ ఘటన కథాంశంగా తీసుకున్నారు. భారత్-చైనా సైనికులమధ్య గాల్వాన్ లోయలో భీకర పోరు జరిగిన సంగతి తెలిసిందే.
ఇది భారత జవాన్ల ధైర్యసాహసాలకు ఓ మచ్చుతునక. కేవలం 200 మంది భారత సైనికులు 1200 మంది లిబరేషన్ ఆర్మీ సైనికులను నిలువరించారు. కొందరిని మట్టి కరిపించారు. ఈ పోరుల కొందరు భారత సైనికులు అసువులు బాసారు. ఈ అపూర్వ ఘట్టమే తెరపైకి రాబోతుంది. 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' పేరుతో పాత్రికేయులు శివ్ అరూల్, రాహుల్ సింగ్ లు రాసిన పుస్తకం ఆధారంగా తీస్తున్నారు. గాల్వాన్ చాప్టర్ హక్కుల్ని అపూర్వా లాఖియా దక్కించుకున్నారు.
సల్మాన్ ఇప్పటికే పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారు. బాగా సన్నగా మారుతున్నారట. జులై లో లడఖ్ లో షూటింగ్ ప్రారంభించనున్నారుట. దాదాపు 25 రోజల పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. అక్కడే కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అటుపై ముంబైలో షూటింగ్ ఉంటుందని..నవంబర్ నాటికి షూట్ మొత్తం పూర్తి చేయాలన్నది యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది.
