Begin typing your search above and press return to search.

ఈద్ రిలీజ్ ల‌కు స్టార్ హీరో గుడ్ బై!

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఈద్ పండుగ ఓ పెద్ద సెంటిమెంట్. ప్ర‌తీ ఏడాది ఈద్ సంద‌ర్భంగా కొత్త సినిమా రిలీజ్ చేయ‌డం అన్న‌ది అన‌వాయితీ.

By:  Tupaki Desk   |   19 July 2025 1:00 AM IST
ఈద్ రిలీజ్ ల‌కు స్టార్ హీరో గుడ్ బై!
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఈద్ పండుగ ఓ పెద్ద సెంటిమెంట్. ప్ర‌తీ ఏడాది ఈద్ సంద‌ర్భంగా కొత్త సినిమా రిలీజ్ చేయ‌డం అన్న‌ది అన‌వాయితీ. గ‌త 15 ఏళ్ల‌గా ఈ సంప్ర‌దాన్ని పాటిస్తున్నాడు. ఈద్ సంద‌ర్భంగా రిలీజ్ అయిన సినిమాలు మంచి స‌క్సెస్ ని అందిస్తాయ‌న్న‌ది ఆయ‌న ప్రగాఢ న‌మ్మ‌కం. అలాంటి స‌క్సెస్ లు ఎన్నో అందుకున్నాడు. 'వాంటెడ్' నుంచి మొన్న‌టి 'సికింద‌ర్' వ‌ర‌కూ ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మంచి ఫ‌లితాలు సాధించాయి.

కొన్ని వైఫ‌ల్యాలు కూడా ఉన్నాయి. అయితే గ‌త మూడు నాలుగేళ్ల‌గా భాయ్ కి ఈద్ కూడా క‌లిసి రావ‌డం లేదు. 15 ఏళ్ల కెరీర్ గ్రాప్ ని ప‌రిశీలించుకుని ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? వాటిలో ఎన్ని విజ‌యం సాధించాయి? ఎన్ని ప‌రాజ‌యం చెందాయి? ఈద్ సంద‌ర్భంగా రిలీజ్ అయినవి ఎన్ని ? ఇలా మొత్తం బేరీజు వేసుకుని స‌ల్మాన్ ఖాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వినిపిస్తుంది. స‌ల్మాన్ రిలీజ్ ల విషయంలో ఈద్ సెంటిమెంట్ ని త‌ప్పిస్తున్న‌ట్లు ఓవార్త వెలుగులోకి వ‌చ్చింది.

త‌దుప‌రి చిత్రాన్ని మాత్రం ఈద్ సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌నుకోవ‌డం లేదుట‌. ప్ర‌తీగా ఈద్ కంటే ముందు కానీ..ఆ త‌ర్వాత గానీ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం అపూర్వా లాఖియా ద‌ర్శ క‌త్వంలో చైనాతో జ‌రిగిన ఘ‌ట‌న గాల్వానా సంఘ‌ట‌న ఆధారంగా ఓ చిత్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం స‌ల్మాన్ ఖాన్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అయ్యాడు. ఎలాగైనా స‌క్స‌స్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తున్నాడు.

గ‌త కొంత కాలంగా స‌ల్మాన్ న‌టించిన సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్నో క‌థ‌లు విన్న త‌ర్వాత గాల్వానా ఘ‌ట‌న‌కు ఒకే చెప్పి ప‌ట్టాలెక్కించారు. ఈ సినిమాను జ‌న‌వ‌రి లేదా? మార్చి త‌ర్వాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. భార‌త్ -చైనా బోర్డ‌ర్ లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ ఘ‌ట‌న‌లో తెలుగు జ‌వాన్ సంతోష్ బాబు అసువులు బాసిన సంగ‌తి తెలిసిందే.