తెలంగాణ సైనికుడి జీవితంలో సల్మాన్ ఖాన్!
తాజాగా సంతోష్ బాబు జీవితాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్దమవుతోంది. సంతోష్ బాబు పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు.
By: Tupaki Desk | 19 May 2025 12:19 PM ISTభారత్ చేపట్టిన `ఆపరేషన్ సిందూర్` నేపథ్యంలో మళ్లీ సైనికుల జీవితంలో నెట్టింట చర్చనీ యాంశంగా మారుతున్నాయి. అమరులైన సైనికుల కథల గురించి నెట్టింట నెటి జనులు సెర్చ్ చేయడం పెరిగింది. వార్ బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమాలు క్యూలో ఉన్నాయి. ఎవరి బయోపిక్ లు వెండి తెరకెక్కతున్నాయి? అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు జీవితం తెరపైకి వచ్చింది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణలో చైనా ఎర్ర సైన్యాన్ని ఎదుర్కుని భారత దళాలకు నాయకత్వం వహించి సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే.
తాజాగా సంతోష్ బాబు జీవితాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్దమవుతోంది. సంతోష్ బాబు పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. సురేష్ నాయర్, చింతన్ గాంధీ , చింతన్ షా ఈ కథను సిద్దంచేస్తున్నారు. శివ్ అరూర్- హుల్ సింగ్ రచించిన `ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్3` నవల ఆధారంగా స్టోరీ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని అపూర్వా లాఖియా తెరకెక్కించనున్నారు. జులైలో షూటింగ్ ప్రారంభిం చాలని సన్నాహాలు చేస్తున్నారు. 70 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేయాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.
సంతోష్ బాబు పాత్రకు సంబంధించి సల్మాన్ ఖాన్ ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ విషయంతో సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలియడంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేసారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన తమ బిడ్డ జీవితం తెరపై చూసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఆర్మీ మ్యాన్ గా నటించడం సల్మాన్ కు కొత్తేం కాదు. `హీరోస్` చిత్రంలో ఆర్మీ హవల్దార్‌గా అతిధి పాత్ర పోషించారు. అటుపై `ఏక్ థా టైగర్`, `టైగర్ జిందా హై` వంటి స్పై చిత్రాల్లో రా ఏజెంట్ పాత్రలు పోషిం చాడు. అవి మంచి విజయాలు సాధించాయి. సంతోష్ బాబు కథలో ఎంతో ఎమోషన్ ఉంది. సినిమాకు అదే ప్రధాన బలం. ఆ మద్య రిలీజ్ అయిన అమరన్ సక్సెస్ కి కారణం ఆ ఎమోషన్. సంతోష్ బాబు తెలంగాణ ప్రాంతం సూర్యపేటకు చెందిన వాసి.
