మెగాస్టార్‌పై ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ నిజమౌతుందా?
`టైగర్ జిందాహై` తరువాత సల్మాన్ ఖాన్ ఆ స్థాయి బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని ఏళ్లవుతోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 9:00 PM IST'టైగర్ జిందాహై' తరువాత సల్మాన్ ఖాన్ ఆ స్థాయి బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని ఏళ్లవుతోంది. మధ్యతో భారత్, టైగర్ 3 వంటి సినిమాలు కలెక్షన్‌ల పరంగా కొంత ఊరటనిచ్చాయి. కానీ సల్మన్ స్థాయికి తగ్గ వసూళ్లని మాత్రం రాబట్టలేకపోయాయి. అప్పటి నుంచి సికందర్ వరకు సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందుల్నిఫేస్ చేస్తూనే ఉన్నాడు. వెంకీతో కలిసి `కిసీకీ భాయ్ కిసీకీ జాన్` చేసినా, తమిళ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్‌ని నమ్మి `సికందర్` చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఈ రెఉండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ కావడమే కాకుండా పెట్టిన బడ్జెట్‌ని కూడా పూర్తి స్థాయిలో రాబట్టలేక డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌పై ఆస్ట్రాలజర్ సుశీల్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా సిద్ధార్ధ్ కన్నన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ తీవ్ర స్థాయిలో సల్మాన్‌పై విరుచుకుపడ్డారు. సల్మాన్ భవిష్యత్తు ముగిసిందన్నారు. అతని కెరీర్ ఇక ఎండ్ అయినట్టేనని, తను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పి షాక్ ఇచ్చారు.
అంతే కాకుండా ప్రస్తుతం ఆయనకు ఏ విధంగానూ బాగా లేదన్నారు. మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని అత్యధికులు నమ్ముతారన్నది తెలిసిందే. అలాంటిది ఓ సెటబ్రిటీ కెరీర్ గురించి, అతని ఆరోగ్య సమస్యల గురించి ఇలా ఓ జ్యోతిష్యుడు బాహాటంగా చెప్పడం ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ సల్మాన్ ఖాన్ కెరీర్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కుంటోంది. గత కొంత కాలంగా సల్లూ భాయ్ తన మార్కు బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు.
ప్రతి నటుడికి కెరీర్ పరంగా హైలు, డౌన్‌లు కామన్. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితుల్ని ప్రతి నటుడు ఎదుర్కొనేవే. సల్మాన్ ఖాన్ తన కెరీర్ ప్రారంభంలోనూ, ఆ తరువాత కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దాని నుంచి బయటపడి వరుస బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుని బాలీవుడ్‌లో ఓ స్టార్‌గా ఎదిగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ స్టార్‌లలో సల్మాన్ ఖాన్ ఒకరు. అలాంటి స్టార్ నటుడి గురించి జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ `అతని కెరీర్ ముగిసిందని, అతనికి ఇక భవిష్యత్తు లేదని, ఆరోగ్య పరంగానూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని బాహాటంగా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
