Begin typing your search above and press return to search.

40 మంది గార్డులున్నా స్టార్ హీరోలో టెన్ష‌న్!

ఇప్ప‌టికి 6 నుంచి 10 సార్లు స‌ల్మాన్ కి అత‌డి కుటుంబానికి హ‌త్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ స‌ల్మాన్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌డం లేదు.

By:  Tupaki Desk   |   16 April 2025 9:52 AM IST
Terror Shadows Bollywood Salman Khan Under Bomb Threat
X

మ‌ర‌ణ భ‌యం ఎంత‌టివారిని అయినా కుంగ‌దీస్తుంది. ``చంపేస్తాం.. అది ఈరోజు లేదా రేపు.. ఏదో ఒక రోజు నీకు ముహూర్తం పెడ‌తాం!`` అని గ్యాంగ్ స్ట‌ర్లు బెదిరించాక ఎవ‌రికైనా కంటిపై కునుకు ప‌డుతుందా? ఇది అంత సులువేమీ కాదు. ప్ర‌స్తుతం ఇలాంటి భ‌యంక‌ర‌మైన టెన్ష‌న్ ఎదుర్కొంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ కు కొన్నేళ్లుగా ఇదే ప‌రిస్థితి ఉంది. అత‌డు త‌మ ఆరాధ్య దైవం కృష్ణ జింక‌ను వేటాడి చంపాడ‌నే ప‌గ‌తో బిష్ణోయ్ తెగ‌కు చెందిన లారెన్స్ అనే ఒక కుర్రాడు ప‌గ‌బ‌ట్టి, అత‌డు ఎదిగే క్ర‌మంలో ప‌గ‌ను పెంచుకుని ద‌శాబ్ధాలుగా స్టార్ హీరోని వెంటాడుతున్న క‌థ ప్ర‌పంచం దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది.

ఇప్ప‌టికి 6 నుంచి 10 సార్లు స‌ల్మాన్ కి అత‌డి కుటుంబానికి హ‌త్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ స‌ల్మాన్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఇలాంటి భ‌యాన‌క ప‌రిస్థితుల న‌డుమ‌.. నిన్న‌గాక మొన్న స‌ల్మాన్ కార్ లో వెళుతున్నా బాంబ్ దాడి చేసి చంపేస్తామ‌ని పోలీసుల‌కు సంక్షిప్త సందేశం పంపి బెదిరించారు. దీంతో భాయ్ సెక్యూరిటీ హై అలెర్ట్ అయింది. ఇప్పుడు వాతావ‌ర‌ణం అంతా టెన్ష‌న్ టెన్ష‌న్ గా ఉంద‌ని ముంబై వ‌ర్గాల స‌మాచారం.

బాంబు బెదిరింపు తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్ర‌స్తుతం ఈ బెదిరింపుల‌పై పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. మేఘనా డేకా దర్యాప్తు అధికారి. స‌ల్మాన్ రూ.2 కోట్ల ఖ‌రీదైన‌ SUV కార్ ని గ‌తంలో విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్ లో వెళుతున్నా బాంబ్ విసిరి చంపేస్తామ‌ని ఎస్.ఎం.ఎస్ లో ఉంది. ఈ భయంకరమైన బాంబు బెదిరింపు తర్వాత స‌ల్మాన్ వ్య‌క్తిగ‌త ప్రయివేట్ సెక్యూరిటీ గార్డ్ షెరా అతడి బృందం సహా 40 మంది గార్డులతో భద్రతను పెంచారు.

బాలీవుడ్ లో ఇప్పుడు అంత‌టా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. సల్మాన్ నుండి సైఫ్, షారుఖ్ ఖాన్ వరకు - అగ్ర తారలు ఇప్పుడు ఎటాక‌ర్ల జాబితాలో ఉన్నారు. దీంతో సెల‌బ్రిటీలంతా హై అలెర్ట్ గా ఉన్నారు. అయితే స‌ల్మాన్ పై బెదిరింపుల వెనుక ఎవరున్నారు? ప్రమాదం ఎంత తీవ్రమైనది? అనేదానిపై మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది.