Begin typing your search above and press return to search.

అమీర్ ఆగ‌లేడు.. స‌ల్మాన్ చేయ‌లేడు.. ఏంటో అది!

అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ మ‌ధ్య స్నేహం గురించి తెలిసిందే. షారూఖ్ తో స‌ల్మాన్ గొడ‌వ‌ల్ని రూపు మాపేందుకు అమీర్ ఖాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెరిపాడు

By:  Tupaki Desk   |   19 Jun 2025 10:15 AM IST
అమీర్ ఆగ‌లేడు.. స‌ల్మాన్ చేయ‌లేడు.. ఏంటో అది!
X

అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ మ‌ధ్య స్నేహం గురించి తెలిసిందే. షారూఖ్ తో స‌ల్మాన్ గొడ‌వ‌ల్ని రూపు మాపేందుకు అమీర్ ఖాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెరిపాడు. ఖాన్‌ల మ‌ధ్య ట్ర‌బుల్ షూట‌ర్ గా ప‌ని చేసాడు అమీర్. అందువ‌ల్ల అత‌డంటే ఆ ఇద్ద‌రు ఖాన్‌ల‌కు గౌర‌వం. అయితే అమీర్ పై సెటైర్లు, పంచ్ లు వేస్తూ స‌ర‌దాగా న‌వ్వించ‌డంలోను స‌ల్మాన్ ముందుంటాడు.

ఇప్పుడు గ్రేట్ ఇండియన్ కపిల్ షో మ‌రోసారి అందుకు వేదిక అయింది. ఈ షో తాజా ఎపిసోడ్ జూన్ 21న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ అవుతుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ గ‌మ్మ‌త్త‌యిన విష‌యాల‌తో ఫ‌న్నీగా సాగింది. ఈ షోలో పాల్గొన్న స‌ల్మాన్ భాయ్ త‌న స‌హ‌చ‌రుడు, స్నేహితుడు అయిన‌ అమీర్ ఖాన్ పై చాలా పంచ్ లే వేసాడు. క‌పిల్ తో సంభాష‌ణ‌ల్లో అమీర్ ఖాన్ కొత్త గాళ్ ఫ్రెండ్ గౌరీ గురించిన ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. స‌ల్మాన్ భాయ్ పెళ్లి గురించి కూడా క‌పిల్ అడిగాడు.

తాజాగా రిలీజైన‌ ప్రోమోలో చాలా గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలున్నాయి. ఆమిర్ ఖాన్ ఇటీవల తన స్నేహితురాలిని తన అభిమానులకు పరిచయం చేశాడని కపిల్ శర్మ సల్మాన్‌కు చెప్పాడు. ``అతడు ఆగడం లేదు.. మీరు చేయడం లేదు!`` అంటూ స‌ల్మాన్ ని హోస్ట్ క‌పిల్ ఆట‌పట్టించాడు. దీనికి సల్మాన్ ఆమీర్ కి బాత్ హి కుచ్ ఔర్ హై (ఆమీర్ భిన్నంగా ఉంటాడు) అని బదులిచ్చారు. అతడు ఒక పరిపూర్ణతావాది.. వివాహాన్ని పరిపూర్ణం చేయకపోతే...! అంటూ స‌ల్మాన్ ఫ‌న్ క్రియేట్ చేసాడు. స‌ల్మాన్, క‌పిల్ జోకులు, ప‌రాచికాల‌కు అహూతులు న‌వ్వులు చిందించారు. అయితే స‌ల్మాన్ ఎప్ప‌టికి పెళ్లి చేసుకుంటాడు! అనేది మాత్రం ఇంకా తేల‌లేదు.

తన సొంత సినిమాపైనా సల్మాన్ త‌న‌కు తానుగానే జోక్ వేసాడు. సికందర్ సే కోయి ఫరక్ తో నహీ పదా? (సికందర్ మీ వాలెట్‌కు హాని చేశారా?) అని క‌పిల్ ని భాయ్ అడిగాడు. సికందర్ బాక్సాఫీస్ కలెక్షన్‌ను పరోక్షంగా విమర్శిస్తూ త‌న‌లో తానే నవ్వుకున్నాడు. మొత్తానికి ఈ షోని మురుగ‌దాస్ చూసి ఉంటే అంత‌గా బావుండేది కాదేమో!