రాజుగారు రూల్ అపూర్వా లాఖియా ఫాలో అవుతున్నాడా?
సల్మాన్ ఖాన్ వరుస పరాజయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన `సికిందర్` కూడా ప్లాప్ అయింది.
By: Tupaki Desk | 11 July 2025 8:00 PM ISTసల్మాన్ ఖాన్ వరుస పరాజయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన `సికిందర్` కూడా ప్లాప్ అయింది. అయినా సరే! భాయ్ మాత్రం ఎక్కడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఎన్ని ప్లాప్ లు ఎదురైతే అంత కసిగా పని చేస్తాను అన్నట్లు రెట్టించిన ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. అందులో ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్లను ...హీరోయిన్లను ఎంచుకోవడం భాయ్ స్పెషాల్టీ మరోసారి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అపూర్వా లాఖియాతో గాల్వానా ఘటన నేపథ్యంలో ఓ యుద్ద సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
అపూర్వా లాఖియా సినిమా చేసి ఏడేళ్లు అవుతుంది. వరు ప్లాప్ ల నేపథ్యంలో లాఖాయాకు అవకాశాలు రాక ఖాళీగా ఉన్నారు. అయినా నేను ఉన్నానంటూ సల్మాన్ ఖాన్ అతడిపై దయ చూపాడు. ఈ క్రమంలోనే గాల్వానా ఘటనపై సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇందులో హీరోయిన్ గా కూడా ప్లాప్ బ్యూటీ తీసుకోవడం మరో విశేషం. బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. బాలీవుడ్ లో చిత్రాంగదా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
హీరోయిన్ గా పెద్ద సక్సెస్ ల్లేవు. చేసిన సినిమాలు కూడా తక్కువే. హీరోయిన్ కంటే ఐటం పాటలతోనే పాపులర్ అయింది. అక్కడ కూడా అంత బిజీ కాలేకపోయింది. గత రెండేళ్ల కాలంలో రెండు సినిమాలే చేసింది. చిత్రాంగదా అంటే బాలీవుడ్ లో ఔడెటెడ్ గా మారిపోయింది. అలాంటి నటిని సల్మాన్ సరసన నాయికగా ఎంపిక చేయడం కొస మెరుపు. ఆమె ఎంపిక విషయంలో లాఖియా కూడా ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నాడు. చిత్రాంగద నటన, ప్రతిభ కారణంగానే ఎంపిక చేసామాన్నారు. ఆమెలో కలిసి పనిచేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నట్లు తెలిపారు.
అలా కలిసి పనిచేయడం అన్నది ఇప్పటికి కుదిరిందన్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్- అపూర్వ లాఖియాలు తీరు చూస్తుంటే? ఇటీవలే రాజుగారు చెప్పిన మాట గుర్తొస్తుంది. సక్సెస్ ల్లో ఉన్న వాళ్లతో కాదు సక్సెస్ లేని వాళ్లతో కంటెంట్ తో హిట్ కొట్టాలి. కంటెంట్ చూసి జనాల్ని థియేటర్లకు రప్పించాలి. అలా తమ కంటెంట్ చూసి జనాలు థియేటర్ వచ్చేలా? అపూర్వ లాఖియా ప్లాన్ చేస్తున్నాడేమో. నిజంగా హిట్ అయితే గనుక సినిమా ఓ సంచలనమే అవుతుంది సుమీ.
