Begin typing your search above and press return to search.

సలార్ కోసం కోహ్లీ టీమ్ వాడకం!

ప్రభాస్ సలార్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో ఆసక్తి ఆకాశాన్నీ దాటేస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 1:30 PM GMT
సలార్ కోసం కోహ్లీ టీమ్ వాడకం!
X

ప్రభాస్ సలార్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో ఆసక్తి ఆకాశాన్నీ దాటేస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న మేకర్స్ ఇప్పుడు మాత్రం రెగ్యులర్ అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తోనే కావాల్సినంత క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇక మరింత లోతుగా కూడా సినిమా కంటెంట్ ను వైరల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనెక్వసరం లేదు.


అయితే ఈ క్రమంలో కేజిఎఫ్ మేకర్స్ ఆ రూట్ లో కూడా గట్టిగానే సినిమాలు ప్రమోట్ చేస్తున్నారు. గతంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిలిమ్స్ వారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు టీం తో కేజీఎఫ్ సినిమాను ప్రమోట్ చేయించారు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతున్నప్పుడు కూడా కేజిఎఫ్ మీమ్స్ తో క్రికెట్కు కూడా కావాల్సినంత హైప్ తీసుకువచ్చారు.

ఇక ఇప్పుడు సలార్ సినిమాకు RCB ట్యాగ్ ను గట్టిగానే ఉపయోగిస్తున్నారు. సినిమా ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దానికి సంబంధించిన టైమ్ గురించి అప్డేట్ ఇస్తూ ఆర్సిబి పోస్టర్ వైరల్ చేశారు. అందులో సిరాజ్ మ్యాక్స్ వెల్ మధ్యలో విరాట్ కోహ్లీ అటువైపుగా తిరిగి స్టిల్ ఇచ్చాడు.

అంతేకాకుండా ట్రైలర్ మరో 18 రోజుల్లో అంటూ జెర్సీ నెంబర్ను హైలైట్ చేశారు. మొత్తానికి డిసెంబర్ ఒకటవ తేదీన సాయంత్రం 7:19 నిమిషాలకు సలార్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ రాబోతున్నట్లు ఆ పోస్టర్లో క్లారిటీ ఇచ్చారు. క్రికెట్ ఫీవర్ ను నిర్మాణ సంస్థ సలార్ కోసం గట్టిగానే ఉపయోగించుకుంటుంది. అందులోను కోహ్లీ జెర్సీ నెంబర్ వైరల్ అయ్యేలా చేశారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాల