Begin typing your search above and press return to search.

సలార్ రైట్స్ కోసం ప్రభాస్ స్నేహితులతో పోటీ?

అయితే సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో కానీ బిజినెస్ విషయంలో మాత్రమే ఇంకా ఏ నిర్ణయానికి రాకపోవడం ఆశ్చర్యకరం.

By:  Tupaki Desk   |   10 Oct 2023 10:32 AM GMT
సలార్ రైట్స్ కోసం ప్రభాస్ స్నేహితులతో పోటీ?
X

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికి సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక రిజల్ట్ అందుకునేది. కానీ ఊహించని కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. లాంగ్ వీకెండ్ తో పాటు న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ తో కూడా ఎంతో కొంత ప్రాఫిట్స్ అందుకోవాలి అని నిర్మాతలు గట్టి ప్లాన్ వేశారు.

అయితే సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో కానీ బిజినెస్ విషయంలో మాత్రమే ఇంకా ఏ నిర్ణయానికి రాకపోవడం ఆశ్చర్యకరం. కొన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ దాదాపు క్లోజ్ అయ్యాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా కొన్ని ఏరియాలో డీల్స్ క్లోజ్ కావాల్సి ఉంది. ఇక నైజాం ఏరియా హక్కుల కోసం కూడా గట్టి పోటీ అయితే నెలకొంది. ఈ దిల్ రాజు గడ్డపై సలార్ హక్కులు కోసం ఓవైపు మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మరొకవైపు యువీ క్రియేషన్స్ కూడా చర్చలు జరుపుతోంది.

ఈ విషయంలో ప్రభాస్ ఐతే ఏ విధంగాను కలుగజేసుకోవడం లేదు. హోంబల్ ఫిలిమ్స్ వారే సినిమా బిజినెస్ కొనసాగిస్తున్నారు. అయితే UV మాత్రం నైజం హక్కుల కోసం ప్రభాస్ తో సంబంధం లేకుండానే పోటీపడుతుంది. దానికి తోడు మైత్రి మూవీ కూడా గట్టిగానే ఆఫర్స్ ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో దిల్ రాజు ఎక్కువగా రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు.

వాళ్ళిద్దరూ చాలా బలంగా పోరాడుతూ ఉండడంతో ఆయన వెనుకడుగు వేసినట్లు సమాచారం. అసలే సంక్రాంతికి సినిమాలతో దిల్ రాజు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాడు. కాబట్టి అంతకుముందే సలార్ తో రిస్కు చేయడానికి సిద్ధంగా లేరు. దానికి తోడు సినిమాపై రిజల్ట్ ఎలా ఉంటుందో అని అనుమానాలు కూడా చాలానే వస్తున్నాయి.

ఇక యువీ సలార్ సినిమా హక్కులు దక్కించుకుందాం లేదా మైత్రి చేతికి చిక్కాయ అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం రీ షూట్ చేస్తున్నారు. ఇక ఈనెల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ట్రైలర్ విడుదల చేసేందుకు కూడా దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం.