Begin typing your search above and press return to search.

ఆ హీరో కి.. నమ్మకం లేదా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మాస్ బెల్ట్ లో కొన్నేళ్లుగా నెం.1 హీరోగా కొనసాగుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 4:27 AM GMT
ఆ హీరో కి.. నమ్మకం లేదా?
X

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మాస్ బెల్ట్ లో కొన్నేళ్లుగా నెం.1 హీరోగా కొనసాగుతున్నారు. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించారు. అనేక లవ్, యాక్షన్, పీరియాడిక్ కాన్సెప్టులతో తెరకెక్కిన మూవీల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. కానీ ఇటీవలే ఆయన నటించిన రెండు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.


గతేడాది ఏప్రిల్ లో సల్మాన్- పూజా హెగ్డే జంటగా నటించిన కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ మూవీ రిలీజైంది. కోలీవుడ్‌ లో వచ్చిన వీరమ్‌, తెలుగులో వచ్చిన కాటమరాయుడు చిత్రాలకు రీమేక్‌ గా బాలీవుడ్‌ లో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. వెంకటేశ్‌, భూమిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య వేసవి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.

ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో టైగర్-3 పైనే ఆశలు పెట్టుకున్నారంతా. ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై తర్వాత టైగర్‌ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్‌ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కూడా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. సిరీస్ లో ముందు రెండు చిత్రాలు సూపర్ హిట్ అయినప్పటికీ.. టైగర్-3 మాత్రం మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.

ఈ రెండు మూవీల రిజల్ట్ అలా ఉండడంతో.. తన సినిమాల సెలక్షన్ లోనే లోపం ఉందని సల్మాన్ ఖాన్ గ్రహించారట. అందుకే తన కొత్త చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తన మాస్ ఇమేజ్ తో మరోసారి అదరగొట్టడానికి తమిళ దర్శకులతోనే పని చేయాలని ఫిక్స్ అయ్యారట. బీటౌన్ డైరక్టర్లతోపాటు రైటర్లపై సల్మాన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట.

సల్మాన్ కొత్త ప్రాజెక్ట్ ది బుల్ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందట. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కోసం సల్మాన్.. కోలీవుడ్ డైరెక్టర్స్ ఏఆర్ మురుగదాస్, అట్లీతో చర్చలు జరుపుతున్నారట. అయితే సల్మాన్- అట్లీ కాంబోలో దబాంగ్-4 రానుందని బీటౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి సల్మాన్ తన నెక్స్ట్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.