Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌తో పెట్టుకున్నాడు.. క్ర‌ష్ అయిపోతాడు!

28 సెప్టెంబ‌ర్ డేట్ ని లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ వేడిలో ఫ్యాన్స్ దెబ్బ‌కు 'వ్యాక్సిన్ వార్' క్ర‌ష్ అయిపోవ‌డం గ్యారెంటీ అంటూ సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2023 3:00 AM GMT
ప్ర‌భాస్‌తో పెట్టుకున్నాడు.. క్ర‌ష్ అయిపోతాడు!
X

ఆదిపురుష్ సినిమా విష‌యంలో కామెంట్లు చేసాడు వివేక్ అగ్నిహోత్రి. అక్క‌డితో ఆగ‌కుండా ప్ర‌భాస్ ని అస‌లు న‌టుడే కాద‌ని కూడా విమ‌ర్శించాడు. అత‌డి కామెంట్ల‌కు ప్ర‌భాస్ ప్ర‌పంచ‌వ్యాప్త అభిమానులు భ‌గ‌భ‌గ మండారు. అగ్నిహోత్రిపై ప‌గ ప్ర‌తీకారం తీర్చుకునే స‌మ‌యం కోసం కొంద‌రు చాలా కోపంగా వేచి చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి క్ర‌ష్ అయిపోవ‌డానికి ఒక సంద‌ర్భం రానే వ‌చ్చింది. అత‌డు తెర‌కెక్కించిన ది 'వ్యాక్సిన్ వార్' ఏకంగా ప్ర‌భాస్ స‌లార్ తోనే పోటీప‌డుతోంది. నిజానికి డాక్యు సినిమాలు తీసే అగ్నిహోత్రి సినిమా స‌లార్ లాంటి మాస్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా ముందు క్ర‌ష్ అయిపోకుండా ఉంటుందా? ప్ర‌భాస్ అభిమానులు టైమ్ చూసి గుణ‌పాఠం చెప్ప‌కుండా ఉంటారా? అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ Vs ప్రభాస్ 'స‌లార్' క్లాష్ ఈ సెప్టెంబర్‌లో షురూ అయింది. అప్ప‌ట్లో కాశ్మీర్ ఫైల్స్ విజ‌యం సాధించ‌గా రాధేశ్యామ్ ఫ్లాపైంది. ఆ విజయం తర్వాత వివేక్ అగ్నిహోత్రి మళ్లీ ప్రభాస్‌తో తలప‌డుతున్నాడు. ఈసారి మ‌రింత గ‌ర్వంగా త‌ల‌ప‌డ‌బోతున్నాడు. నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన ది వ్యాక్సిన్ వార్ 28 సెప్టెంబర్ 2023న సాలార్ పార్ట్ 1తో తలపడనుంది. స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున‌ ఉదయం వివేక్ అగ్నిహోత్రి తన చిత్రం విడుదల తేదీని అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసారు.

వ్యాక్సిన్ వార్ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. COVID-19 మహమ్మారి స‌వాళ్లు కొన‌సాగుతున్న‌ సమయంలో మన దేశం వైద్యపరంగా సాధించిన‌ విజయాలను ప్రదర్శించే చిత్ర‌మిది. విదేశీ డ్ర‌గ్ సంస్థ‌ల‌తో పోటీప‌డి భార‌త్ అజేయంగా ఎలా వ్యాక్సిన్ ని త‌యారు చేసిందో ఈ వ్యాక్సిన్ విష‌యంలో ఎలాంటి వార్ న‌డిచిందో కూడా చూపించ‌బోతున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ త‌ర‌హాలో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ని చూపిస్తాడా? లేక డాక్యు సినిమా త‌ర‌హాలో స్లో నేరేష‌న్ తో నిరాస‌ప‌రుస్తాడా? అన్న‌ది వేచి చూడాలి. సలార్ బ‌డ్జెట్ తో ఎంత‌మాత్రం పోలిక‌లేని చిన్న సినిమా ఇది. ఇలాంటి త‌క్కువ‌ బ‌డ్జెట్ చిత్రాల‌కు స్క్రీన్ ప్లే ప‌రంగా గ్రిప్పింగ్ గా తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం స‌లార్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. కేజీఎఫ్ లాంటి సంచ‌ల‌నాన్ని సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ ని మ‌రో రేంజ్ యాక్ష‌న్ స్టార్ గా చూపించ‌బోతున్నార‌ని ఉత్సుక‌త‌గా వేచి చూస్తున్నారు. 28 సెప్టెంబ‌ర్ డేట్ ని లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ వేడిలో ఫ్యాన్స్ దెబ్బ‌కు 'వ్యాక్సిన్ వార్' క్ర‌ష్ అయిపోవ‌డం గ్యారెంటీ అంటూ సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆరోజు నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా వార్ వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్' 11మార్చి 2022న ప్రభాస్ రాధే శ్యామ్‌తో ఘర్షణ పడింది. కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన బ్లాక్‌బస్టర్ కాగా.. రాధేశ్యామ్ భారీ వైఫల్యం చెందింది. కానీ ఇప్ప‌టి స‌న్నివేశం వేరు. స‌లార్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లోనే టాప్ లిస్ట్ లో ఉంది. స‌లార్ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్లాది మందికి చేరువైంది. ఈ టీజ‌ర్ పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వరుస ట్వీట్ల రూపంలో తెలియజేశారు. అత‌డు ప్ర‌భాస్ ని టీజ్ చేసాడు. దాని ఫ‌లితం బాక్సాఫీస్ హోరాహోరీలో తేలాల్సి ఉంది.