Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ గెట్​ రెడీ.. సలార్​ అప్డేట్స్​ షెడ్యూల్ ఇదే!

ఇప్పటివరకు రెండు మూడు పోస్టర్లు, ఓ స్మాల్ గ్లింప్స్​ను విడుదల చేసి సైలెంట్​గా ఉన్న మేకర్స్​.. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్​ను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:42 AM GMT
ఫ్యాన్స్ గెట్​ రెడీ.. సలార్​ అప్డేట్స్​ షెడ్యూల్ ఇదే!
X

రానున్న క్రిస్మస్ సందర్భంగా సలార్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా భారీ వసూళ్లను అందుకే అవకాశం ఉందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ఈ సినిమా ప్రమోషన్స్​ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రమోషన్స్​ గురించి అప్డేట్ షెడ్యూల్​ బయటకు వచ్చింది!

వివరాళ్లోకి వెళితే.. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ప్రభాస్ సలార్ ఇప్పటికే విడుదల అయ్యేది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్​ వల్ల సినిమా విడుదల తేదీ డిసెంబర్ 22కు వాయిదా పడింది. ఇప్పటివరకు రెండు మూడు పోస్టర్లు, ఓ స్మాల్ గ్లింప్స్​ను విడుదల చేసి సైలెంట్​గా ఉన్న మేకర్స్​.. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్​ను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.

రీసెంట్​గా కూడా ప్రమోషన్ కోసం ప్రభాస్ నెల రోజుల పాటు సమయం కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా లెవెల్​లో రీచ్ వచ్చేలా అందుకు కావాల్సిన ప్లాన్ చేస్తున్నారని కథనాలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఇప్పుడు తాజాగా మరో సమాచారం అందింది. సలార్ నుంచి రాబోయే అప్డేట్స్​ వివరాలు కొన్ని తెలిశాయి. మొదట ఓ టీజర్​ను విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్​తో మరింత హైప్ పెంచి.. అనంతరం వరుసగా 5 నుంచి 7 పోస్టర్లను విడుదల చేసి ఫ్యాన్స్​లో ఖుషి నింపుదామని సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఓకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగనే చెప్పాలి.

అసలే ప్రభాస్ సాహో, రాధే శ్యామ్‌, ఆదిపురుష్ అంటూ మూడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్​కు సలార్ విజయం చాలా కీలకం. అందుకు తగ్గట్టే ఈ చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియుల్లో భారీ హైప్ నెలకొంది. చూడాలి మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో.. ఇకపోతే ఈ సినిమాకు పోటీగా అదే సమయంలో బాలీవుడ్ బాద్​షా షారుక్ డంకీ కూడా రాబోతుంది.