Begin typing your search above and press return to search.

సలార్ ట్రోల్స్.. యానిమాల్ కంటే గట్టిగా కొట్టేనా?

సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియసిటీ అయితే అందరిలో కలిగింది. కాబట్టి సినిమాపై అంతకుముందు వచ్చిన ట్రోల్స్ కూడా ఎగిరిపోయాయి.

By:  Tupaki Desk   |   26 Nov 2023 8:47 AM GMT
సలార్ ట్రోల్స్.. యానిమాల్ కంటే గట్టిగా కొట్టేనా?
X

ఎంత గొప్ప సినిమా తీసినా.. ఎంత డిఫరెంట్ గా ఆర్ట్ సినిమా తీసినా కూడా జనాలు థియేటర్ వరకు రావాలి అంటే ముందు కాంటెంట్ కొసరు స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగి తేలే జనాలకు పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతీది ఆకట్టుకునే విధంగా ఉండాలి. 250 రూపాయలు అంతకంటే విలువైన రెండు గంటల సమయాన్ని ఒక సినిమాకు ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తున్నారు. అందుకే ముఖ్యంగా ట్రైలర్ తో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ గ్యారెంటీ అనే భరోసా కల్పించాలి.

ఇక ఇటీవల వచ్చిన యానిమాల్ ట్రైలర్ అయితే ఆ నమ్మకాన్ని గట్టిగానే ఇచ్చింది. ఇక థియేటర్లలో సినిమా చూడాలని ఎక్కువగా యూత్ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. తండ్రి కొడుకు ఏమోషన్ అనే పాయింట్ తో సందీప్ రెడ్డి వంగా హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు వైలెంట్ ఏమోషన్ ను చూపించబొతున్నట్లు భరోసా కలిగించాడు.

సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియసిటీ అయితే అందరిలో కలిగింది. కాబట్టి సినిమాపై అంతకుముందు వచ్చిన ట్రోల్స్ కూడా ఎగిరిపోయాయి. సినిమా రన్ టైమ్ మూడు గంటల కంటే ఎక్కువే అనగానే.. ట్రోలర్స్ థియేటర్స్ లో దుప్పట్లు తెచ్చుకొని పడుకోవాలి అని వెటకారం చేశారు. కానీ ట్రైలర్ తో అలాంటి కామెంట్స్ ఎక్కడా కనిపించలేదు.

ఇక ఇప్పుడు సలార్ కూడా ఆ రేంజ్ లో ట్రోలర్స్ కు ట్రైలర్ తో సమాధానం ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీజర్ లో ప్రభాస్ మొహం కూడా చూపించలేదు. అలాగే వచ్చిన పోస్టర్ లో కూడా ప్రభాస్ ఫేస్ పై విభిన్నమైన కామెంట్స్ వచ్చాయి. ఇక ట్రైలర్ లో అయినా ప్రభాస్ ఫేస్ చూపిస్తారా లేదా అనేలా ట్రోల్స్ వస్తున్నాయి.

డిసెంబర్ 1న ట్రైలర్ రాబోతున్న విషయం తెలిసిందే. కాబట్టి తప్పనిసరి సలార్ కూడా ట్రైలర్ తో మెప్పించి తీరాలి. ప్రభాస్ ఫేస్ మాత్రమే కాకుండా హై వోల్టేజ్ యాక్షన్ ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉండాలి. అప్పుడే సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. మరి ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చేలా ఆ రేంజ్ లో సలార్ ట్రైలర్ క్లిక్ అవుతుందో లేదో చూడాలి.