Begin typing your search above and press return to search.

సలార్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. కానీ!

ఆగస్టు 28వ తేదీన ఈ మూవీ ట్రైలర్ విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 11:59 AM GMT
సలార్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. కానీ!
X

బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటి నుంచి ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. కానీ, బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రతి సినిమాకీ ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. కానీ, ఫలితం మాత్రం లభించడం లేదు. దీంతో, ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మూవీపైనే ఉన్నాయి. ఈ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో కన్ఫామ్ అయింది. కానీ, ఇప్పటి వరకు ట్రైలర్ ఊసు మాత్రం ఎత్తలేదు. ఎప్పుడో టీజర్ విడుదల చేశారు. టీజర్ కి రెస్పాన్స్ బాగా వచ్చింది. దీంతో, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ట్రైలర్ కి మూవీ టీమ్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ముందు నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు తగినట్లే మూవీ టీమ్ కూడా ఓ హింట్ ఇచ్చింది. ఆగస్టు 28వ తేదీన ఈ మూవీ ట్రైలర్ విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, ఈ సినిమా తో అయినా ప్రభాస్ కి హిట్ ఎప్పుడు వస్తుందో లేదో చూడాలి. కాగా, ఈ మూవీ విడుదలకు సంబంధించిన పనులు మాత్రం ఇప్పుడే మొదలుపెట్టడం విశేషం. థియేటర్ల కేటాయింపులు, ప్రీ రిలీజ్ బిజినెస్ వంటి పనులు స్టార్టయ్యాయి. ఇక, థియేటర్ లోకి అడుగుపెట్టడమే ఆలస్యం.

కాగా, వరస వైఫల్యాలతో ఉన్న ప్రభాస్ కి ఈ మూవీ కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్ తో యశ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ కి కూడా కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లు విలన్ గా నటిస్తున్నారు.

తొలిసారి శ్రుతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు యంగ్ హీరోలతో నటించే అవకాశాలు తగ్గిపోయి, సీనియర్ హీరోలతో చేస్తున్న శ్రుతిని ప్రభాస్ పక్కన ఇప్పుడు ఎంచుకోవడం విశేషం. ఇక, ప్రభాస్ ఈ సినిమాతో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహించిన వ్యాక్సిన్ మూవీ పోటీ పడుతోంది. ఇది కూడా సెప్టెంబర్ 28వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు సినిమాల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.