Begin typing your search above and press return to search.

'సలార్'.. 6 షోలు.. టికెట్ రేట్లు ఎంతంటే?

ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది

By:  Tupaki Desk   |   19 Dec 2023 2:55 PM GMT
సలార్.. 6 షోలు.. టికెట్ రేట్లు ఎంతంటే?
X

ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా రిలీజ్ చేసిన యాక్షన్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. మొదటి ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా రెండవ ట్రైలర్ మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈ మూవీని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సలార్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా? ఎప్పుడు టికెట్లు కొనెద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్, నార్త్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. తాజాగా నైజాంలో కొన్ని థియేటర్స్ లో ఆఫ్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

దీంతో థియేటర్స్ వద్ద సలార్ టికెట్స్ కోసం ఆడియన్స్ క్యూ కట్టారు. ఇదిలా ఉంటే నైజాంలో సలార్ మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అలాగే స్పెషల్ షోల అనుమతి కోసం ఇటీవల మేకర్స్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వం అందుకు అనుకూలంగా స్పందించింది. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ కూడా ఇచ్చింది.

ఇక నైజాంలో సలార్ టికెట్ రేట్ల విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో రూ 250, రూ.175, రూ.100 గా ఉండగా, మల్టీప్లెక్స్ లో రూ 370, రూ.470 ధరలతో టికెట్స్ ని నిర్ణయించారు. సాధారణ టికెట్ రేట్ తో పోలిస్తే మల్టీప్లెక్స్ లో రూ.100 రూపాయలు నార్మల్ థియేటర్స్ లో రూ.55 రూపాయలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అలాగే 6 షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు నైజాంలోని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఎర్లీ మార్నింగ్ ఒంటిగంట షో తో సినిమాను ప్రదర్శించుకునే వీలును కల్పించింది.

కాగా ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షో ల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. సలార్ మూవీ నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం మైత్రి నిర్మాతలు సుమారు రూ.65 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ సినిమాని నిర్మించిన హోం బలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహ, శృతిహాసన్, శ్రీయ రెడ్డి కీలకపాత్రలు పోషించారు.