Begin typing your search above and press return to search.

సలార్.. అక్కడ కూడా గట్టిగానే..

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించని స్థాయిలో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 6:45 AM GMT
సలార్.. అక్కడ కూడా గట్టిగానే..
X

పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా క్రేజ్ అందుకుంటున్న ప్రభాస్ బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడక పోయినప్పటికీ క్రేజ్ అయితే అసలు తగ్గడం లేదు. ప్రతి సినిమాకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలోనే ఓపెనింగ్ అందుకుంటూ ఉన్నాడు. ఇక దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ రేంజ్ అస్సలు తగ్గడం లేదనే చెప్పాలి. ఇక ప్రభాస్ అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా విభిన్నమైన తరహాలోనే సినిమాలు చేసేందుకు ఇష్టపడుతూ ఉన్నాడు.


ప్రభాస్ నుంచి రాబోతున్న సలార్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ తో అంచనాల స్థాయిని అమాంతం పెంచేసింది. తప్పకుండా ప్రభాస్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊహించని స్థాయిలో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

అయితే స్విజర్లాండ్ లో కూడా ప్రభాస్ సినిమాను ఈసారి గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. అక్కడ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తాళం సలార్ సినిమాను విడుదల చేయబోతోంది. ప్రభాస్ ప్రతి సినిమాకు కూడా ఆ కంట్రీలో మంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు స్విజర్లాండ్ లో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా సలార్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండగా తాళం డిస్ట్రిబ్యూషన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక ఈ సినిమాను వీలైనంత ఎక్కువ సెంటర్లలో విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సలార్ సినిమా ఊహించని స్థాయిలోనే రికార్డు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా అయితే ఫస్ట్ వీకెండ్ లో దాదాపు అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉంది ఇక ఈ క్రేజ్ చూస్తూ ఉంటే ప్రభాస్ మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నట్లుగా తెలుస్తోంది.