Begin typing your search above and press return to search.

స‌లార్-2 తొమ్మిది నెల‌లు ముందుకొచ్చేసిందా?

అది పూర్త‌యిన వెంట‌నే సెట్స్ పైకి వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్ కి చెబితే ఆయ‌న కూడా నో చెప్ప‌కుండా రోడీ అనేసారుట‌.

By:  Tupaki Desk   |   13 Feb 2024 8:16 AM GMT
స‌లార్-2 తొమ్మిది నెల‌లు ముందుకొచ్చేసిందా?
X

`స‌లార్ -2` షూటింగ్ తొమ్మిది నెల‌లు ముందుకు వ‌చ్చేస్తుందా? ఆల‌స్యం అమృతం విషం అన్న చందంగా ప్ర‌శాంత్ నీల్ నిర్ణ‌యం మార్చుకున్నాడా? డార్లింగ్ సైతం అందుకు నో చెప్ప‌కుండా ఎస్ నేను సిద్దం అనే సాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `స‌లార్ సీజ్ ఫైర్`ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ స‌హా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. దాదాపు రెండు సంవ‌త్స‌రాలుగా ఈచిత్రాన్ని పూర్తిచేసే ప‌నిలోనే అంతా బాండ్ అయి ప‌నిచేసారు.

భారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రం కావ‌డంతోనే ఇంత స‌మ‌యం ప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో `స‌లార్ -2` ఆల‌స్యం అవ్వొచ్చ‌ని ముందుగానే గెస్సింగ్స్ తెర‌పైకి వ‌చ్చాయి. కానీ 15 నెల‌ల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేస్తామ‌ని హోంబ‌లే ఫిల్మ్స్ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌శాంత్ నీల్-ప్ర‌భాస్ తొమ్మిది నెల‌ల వ‌ర‌కూ ఆ సినిమా గురించి ఆలోచించే ప‌నికూడా లేద‌ని తెర‌పైకి వ‌చ్చింది. స‌లార్ తో బాగా అల‌సిపోవ‌డంతో విరామం కూడా ఎక్కువ‌గానే అవ‌స‌రం అవుతుంద‌ని భావించి అన్ని నెల‌లు గ్యాప్ ఇస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

అయితే ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడా అల‌సట‌ని ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు స‌మాచారం. సినిమాని తొమ్మిది నెల‌లు త‌ర్వాత కాదు.. తొమ్మిది నెల‌లు ముందుకు తీసుకొచ్చి చిత్రాన్ని వీలైనం వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడుట‌. దీనిలో భాగంగా ఇప్ప‌టికే `స‌లార్ -2` కి సంబంధించిన ప‌నులు కూడా మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. స్క్రిప్ట్ కి అవ‌స‌ర‌మైన మెరుగులు దిద్దుతున్నారుట‌.

అది పూర్త‌యిన వెంట‌నే సెట్స్ పైకి వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్ కి చెబితే ఆయ‌న కూడా నో చెప్ప‌కుండా రోడీ అనేసారుట‌. ప్ర‌భాస్ న‌టిస్తోన్న క‌ల్కీ 2898 ఎలాగూ మే లో రిలీజ్ అయిపోతుంది. అప్ప‌టి నుంచి డార్లింగ్ ఖాళీ అయిపోతాడు. మారుతి సినిమా `రాజాసాబ్` ఉంది కానీ స‌లార్ -2 కంటే ప్రాధాన్య‌మున్న సినిమా కాదు కాబ‌ట్టి తాత్కాలికంగా ఆప్రాజెక్ట్ ని ప‌క్క‌న బెట్టాల‌నే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ టాక్.