Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : 'సలార్‌' రమా మన్నార్‌ ని చూశారా..!

అయితే సినిమాలోని లుక్‌ ను ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. తాజాగా సినిమా విడుదల అయిన నేపథ్యం లో తన లుక్ ను రివీల్‌ చేసింది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:09 AM GMT
పిక్ టాక్ : సలార్‌ రమా మన్నార్‌ ని చూశారా..!
X

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సలార్ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్నో పాత్రలను చూపించాడు. అందులో ఒక పాత్ర రాధ రమా మన్నార్‌. కనిపించింది కొద్ది సమయం అయినా కూడా చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌.


రాధ రమా మన్నార్ పాత్రను తమిళ స్టార్‌ నటి శ్రియా రెడ్డి పోషించడం ప్రత్యేకమైన విషయం. లేడీ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితురాలు అనే విషయం తెల్సిందే. సలార్‌ లో రమా మన్నార్‌ పాత్ర ను అద్భుతంగా పోషించిన శ్రియా రెడ్డికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.


సలార్‌ లో తాను అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను.. కచ్చితంగా ప్రేక్షకులు సర్‌ ప్రైజ్‌ అయ్యే విధంగా పాత్ర ఉంటుంది అంటూ పలు సార్లు శ్రియా రెడ్డి సినిమా విడుదలకు ముందు చెప్పుకొచ్చింది. అయితే సినిమాలోని లుక్‌ ను ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. తాజాగా సినిమా విడుదల అయిన నేపథ్యం లో తన లుక్ ను రివీల్‌ చేసింది.


సినిమాలో ఎలా అయితే కనిపించిందో అదే లుక్ ఫోటో షూట్‌ ను సోషల్‌ మీడియా ద్వారా శ్రియా రెడ్డి షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సలార్ సినిమాలో ఈ ఔట్‌ ఫిట్ తో చాలా సీరియస్ పాత్రలో శ్రియా రెడ్డిని ప్రేక్షకులు చూస్తారు. పాత్రకు తగ్గట్లుగా మేకోవర్‌ ఉండటంతో పాటు, చాలా అందంగా కూడా శ్రియా రెడ్డి కనిపించిందని టాక్.

సలార్ లో రాధ రమా మన్నార్‌ పాత్ర తో అలరించిన శ్రియా రెడ్డి త్వరలో పవన్ తో కలిసి 'ఓజీ' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా లో కూడా శ్రియా రెడ్డి చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌ లో కనిపించబోతుందట. ఆ పాత్ర ఎలా ఉంటుంది, ఆ లుక్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.