Begin typing your search above and press return to search.

'సలార్'.. రాజమౌళి టీజర్ కే ఇలా ఉందంటే..!

ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృధ్విరాజ్ సుకుమారన్.. ఈ ముగ్గురిని రాజమౌళి తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   17 Dec 2023 11:25 AM GMT
సలార్.. రాజమౌళి టీజర్ కే ఇలా ఉందంటే..!
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం సినిమాకు సంబంధించి మరో యాక్షన్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. దాంతోపాటు దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళితో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ని కూడా ప్లాన్ చేసింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృధ్విరాజ్ సుకుమారన్.. ఈ ముగ్గురిని రాజమౌళి తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేయబోతున్నారు.

యాక్షన్ ట్రైలర్ ఏమోగానీ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అంతా ఈ స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ఓ శాంపిల్ ని వదిలారు మేకర్స్. అంటే ఇంటర్వ్యూ కు సంబంధించి ఇది ఓ చిన్న టీజర్ అని అనుకోవచ్చు. తాజాగా రిలీజ్ అయిన ఈ వీడియో క్లిప్ లో కేవలం రాజమౌళి మాత్రమే కనిపించాడు. 'People Are Going Crazy With prabhas, Dinosaur, Salaar, Dinosaur' రాజమౌళి అని చెబుతుంటే బ్యాగ్రౌండ్ లో సలార్ బీజీయం వస్తుంది.

ఈ వీడియోని రిలీజ్ చేసి సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో ఈరోజు రిలీజ్ అవుతుందని తెలిపారు. జస్ట్ శాంపిల్ గా వదిలిన టీజర్ ఇలా ఉందంటే ఈరోజు రిలీజ్ అవ్వబయే ప్రోమో, ఆ తర్వాత ఫుల్ ఇంటర్వ్యూ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

రాజమౌళితో ఈ ఒక్క ఇంటర్వ్యూ తప్పితే మూవీ టీం ఇంకెలాంటి ప్రమోషన్స్ ని ప్లాన్ చేయలేదు. ఆఖరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేశారు. ప్రభాస్ సినిమా కాబట్టి ప్రమోషన్ చేయకపోయినా సలార్ కి హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఈరోజు ఈవినింగ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. ప్రభాస్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న యాక్షన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి సలార్ భారి కం బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి సలార్ తో డార్లింగ్ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.