Begin typing your search above and press return to search.

'సలార్' కోసం దిగొచ్చిన‌ PVR

పీవీఆర్ ప‌ద్ధ‌తి త‌ప్పింద‌ని, ఒప్పందం మీరి డంకీకి ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చేందుకు స‌లార్ కి అన్యాయం చేసింద‌ని తొలుత క‌థ‌నాలొచ్చాయి

By:  Tupaki Desk   |   21 Dec 2023 5:04 PM GMT
సలార్ కోసం దిగొచ్చిన‌ PVR
X

ఎగ్జిబిటర్లు ప్రభాస్ సలార్ కంటే షారూఖ్ ఖాన్ డుంకీ వైపు మొగ్గు చూపుతున్నారని విన్న తర్వాత స‌లార్ నిర్మాతలు పీవీఆర్ ని నిషేధించార‌ని క‌థ‌నాలొచ్చాయి. తమ చిత్రాన్ని ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన‌ కొన్ని రాష్ట్రాల్లోని పివిఆర్-ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారని క‌థ‌నాలు వ‌చ్చాయి.

షోల సంఖ్యపై నిర్ణయం ఎగ్జిబిటర్‌దేనని, ప్రేక్ష‌కులే నిర్ణ‌యిస్తార‌ని మిరాజ్ గ్రూప్ సీఈఓ వ్యాఖ్యానించ‌గా, పీవీఆర్ సీఈవో గ్యాన్ చందానీ మాట్లాడుతూ.. రెండు పెద్ద సినిమాలు రిలీజ‌య్యేప్పుడు ఇలాంటివి స‌హ‌జ‌మ‌ని, కానీ ప‌రిస్థితులు మార‌తాయ‌ని అన్నారు. స‌లార్ కి కానీ ఏ ఇత‌ర సినిమాల‌కు తాము వ్య‌తిరేకులం కాద‌ని ప్ర‌క‌టించారు.

పీవీఆర్ ఐనాక్స్ తాజాగా ఒక‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ''సలార్ చిత్రం PVR INOX సినిమాస్‌లో విడుదల కావ‌డం లేద‌ని కొన్ని ఊహాజనిత మీడియా క‌థ‌నాల‌ను మేం చూశాము. ఇవ‌న్నీ తప్పుడు క‌థ‌నాలు అని స్పష్టం చేయాలనుకుంటున్నాము. SALAAR ఈ సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి . ఇది పాన్ ఇండియాలో PVR INOX సినిమాస్‌లో షెడ్యూల్ చేసిన తేదీకి అంటే 22 డిసెంబర్ 2023న విడుదలవుతోంది..'' అని ప్ర‌క‌టించింది. దీంతో స‌లార్ మేక‌ర్స్ హోంబ‌లే సంస్థ‌తో విభేధాల‌ను పీవీఆర్ ప‌రిష్క‌రించుకుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

పీవీఆర్ ప‌ద్ధ‌తి త‌ప్పింద‌ని, ఒప్పందం మీరి డంకీకి ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చేందుకు స‌లార్ కి అన్యాయం చేసింద‌ని తొలుత క‌థ‌నాలొచ్చాయి. PVR పిక్చర్స్ CEO జియాంచందానీ PVR ఐనాక్స్ అవుట్‌లెట్‌లలో సినిమాను విడుదల చేయడానికి సలార్ మేకర్స్ నిరాకరిస్తున్నారనే వార్తలపై స్పందించారు. X లో వ్యాఖ్యానిస్తూ ''సాధారణంగా మేం నిర్మాతలకు సంబంధించిన విషయాలను మాలో మేం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మన అభిప్రాయాన్ని షేర్ చేయ‌డానికి మీడియా ఉంది. PVR-INOXలో అన్యాయమైన ఎగ్జిబిష‌న్ పద్ధతులకు సంబంధించి కొన్ని అసంబద్ధ ఇంటర్నెట్ పోస్ట్‌లను చూశాం. PVR-INOX థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేస్తున్న నిర్మాతలందరికి మించిన గౌరవం ప్రశంసలు వేరే ఎవరికీ లేవు. పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదలవుతున్నందున వాణిజ్యపరమైన విభేదాలు సమానంగా ఉంటాయి. ఇదే మొదటిసారి కాదు. చివరిసారి కాదు. త్వరలో ప్రతిదీ ప‌రిష్కారం అవుతుంది. దయచేసి ఈ హాస్యాస్పదమైన సిద్ధాంతాలను వ‌దిలి పెట్టండి'' అని వ్యాఖ్యానించారు. షారుఖ్ ఖాన్ డంకీ గురువారం విడుదల కాగా దీనికి యావ‌రేజ్ టాక్ వ‌చ్చంది. స‌లార్ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సంద‌ర్భంగా యావ‌రేజ్ సినిమా అని తెలిసాక పీవీఆర్ దిగొచ్చింద‌ని ప్ర‌భాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.