Begin typing your search above and press return to search.

సలార్ బాక్సాఫీస్.. సౌండ్ మొదలైంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో

By:  Tupaki Desk   |   17 Nov 2023 8:21 AM GMT
సలార్ బాక్సాఫీస్.. సౌండ్ మొదలైంది
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో.ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెప్టెంబర్ లో రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 22కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దర్శకుడు. ప్రశాంత్ నీల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా స్పెషల్ సాంగ్ కూడా రీసెంట్ గానే షూట్ చేశారు.

ఇక ప్రభాస్ సలార్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. ఇక సినిమా విడుదల డేట్ దగ్గరపడుతున్న సమయంలో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక యుఎస్ లో కూడా సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఇక ఇప్పటికే యూఎస్ లో సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇండియాలో కంటే అమెరికాలో ఒక రోజు ముందు నుంచి సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఇక కొన్ని లొకేషన్స్ లలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25k డాలర్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సాలీడ్ గా స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. ఇక పూర్తి స్థాయిలో అన్ని లొకేషన్స్ లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నవంబర్ 20 నుంచి ఓపెన్ కానున్నాయి. కేవలం కొన్ని లొకేషన్స్ లలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమా విడుదల సమయానికి హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం పక్కా అని అనిపిస్తోంది.

సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీరాజ్ సుకుమార్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక జగపతిబాబు కూడా ఇందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. మరి ప్రభాస్ ఈసారి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.