Begin typing your search above and press return to search.

స‌లార్ టీమ్ ఇవ్వ‌బోతున్న షాక్

అన్నీ స‌వ్యంగా జ‌రిగి ఉంటే ఈపాటికే `స‌లార్` విడుద‌లై బాక్సాఫీస్ రికార్డుల గురించి చాలా చ‌ర్చ జ‌రిగి ఉండేది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 2:30 AM GMT
స‌లార్ టీమ్ ఇవ్వ‌బోతున్న షాక్
X

అన్నీ స‌వ్యంగా జ‌రిగి ఉంటే ఈపాటికే `స‌లార్` విడుద‌లై బాక్సాఫీస్ రికార్డుల గురించి చాలా చ‌ర్చ జ‌రిగి ఉండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల కావాల్సిన చిత్రాన్ని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఆల‌స్యం కార‌ణంగా డిసెంబ‌ర్ 22 కి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా 50రోజుల్లో స‌లార్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. భారీ యాక్ష‌న్ కంటెంట్ కి త‌గ్గ‌ట్టే వీఎఫ్ ఎక్స్ షాట్స్ ని కూడా ప్ర‌శాంత్ నీల్ మ‌రో లెవ‌ల్లో చిత్రీక‌రించార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే డిసెంబ‌ర్ లో షారూఖ్ డంకీతో పోటీప‌డుతూ స‌లార్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఇంత‌లోనే స‌లార్ ప్ర‌మోష‌న్స్ వీక్ గా ఉన్నాయంటూ అభిమానులు నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు స‌లార్ టీమ్ నుంచి ఊహించ‌ని షాక్ ట్రీట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ బృందం ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండ‌దు! అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇంత‌కీ ప్ర‌శాంత్ నీల్ ఇచ్చే ట్విస్టేంటి? అంటే.. స‌లార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నామ‌ని ఇంత‌కుముందు టీజ‌ర్ లో చెప్పాడు. సీజ్ ఫైర్ మొద‌టి భాగం అని కూడా వెల్ల‌డించాడు. కానీ ఇప్పుడు స‌డెన్ గా స‌లార్ ని ఒక సినిమాగానే రిలీజ్ చేస్తున్నామ‌ని చెప్పేందుకు రెడీ అవుతున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. స‌లార్ రెండో భాగం కోసం చిత్రీక‌రించిన స‌న్నివేశాల్ని కూడా మొద‌టి భాగంలోనే యాడ్ చేసేశార‌ని, ఎంపిక చేసిన క‌థాంశం ఒక భాగంగా వ‌స్తేనే బావుంటుంద‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర‌బృందం నుంచి ఎలాంటి లీకులు అంద‌లేదు. మునుముందు రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో ప్ర‌శాంత్ నీల్ క్లారిటీ ఇస్తార‌నే భావిస్తున్నారు. క్రిస్మ‌స్ బ‌రిలో రిలీజ్ కి వ‌స్తున్న స‌లార్ పూర్తిగా మాస్ యాక్ష‌న్ కంటెంట్ తో తెర‌కెక్క‌గా, రాజ్ కుమార్ హిరాణీ డంకీ పూర్తిగా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందింది. ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల టీజ‌ర్ లు రిలీజై ఆక‌ట్టుకున్నాయి.