Begin typing your search above and press return to search.

సలార్ వాయిదా.. యూఎస్ లో కూడా అదే టెన్షన్

అయితే పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అని పక్కాగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్​లో భారీ రేంజ్​లో బుకింగ్స్​ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:11 AM GMT
సలార్ వాయిదా.. యూఎస్ లో కూడా అదే టెన్షన్
X

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సలార్ మూవీ పుల్​ హాట్ టాపిక్​గా మారింది. అందుకు కారణం పోస్ట్​పోన్​ ప్రచారం. భారీ స్థాయిలో అంచనాలు పెంచి... విడుదల ఎప్పుడెప్పుడా అని ఆత్రుత కలిగించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఒక్కసారిగా వాయిదా ప్రచారంతో తెరపైకి రావడం వల్ల సినీ ప్రియులు, ప్రభాస్ అభిమానులంతా షాక్ అవుతున్నారు. అయితే ఈ వాయిదా గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్ రాలేదు.

అయితే పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అని పక్కాగా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్​లో భారీ రేంజ్​లో బుకింగ్స్​ జరుగుతున్న సంగతి తెలిసిందే. యూఎస్​ బాక్సాఫీస్ ముందు ఇప్పటికే ప్రీమియర్స్ సేల్స్ భారీగా జరిగినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇప్పటికే 19 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు, హాఫ్ మిలియన్​కు పైగా వసూళ్లు కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ ప్రచారం బయటకి రావడం ఫ్యాన్స్​కు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్​కు పెద్ద షాక్​ను ఇస్తోంది. దీంతో అక్కడి థియేటర్స్​ తమ వెబ్​సైట్ల నుంచి షోలకు సంబంధించిన వివరాలను తొలిగించేస్తున్నారట. రిఫండ్ ప్రాసెస్​ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సెప్టెంబరు నెల మొదలైనా ప్రచార కార్యక్రమాలు ఊపందుకోకపోవడంతో రిలీజ్​పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడదే నిజం కాబోతుందని అర్థమవుతున్న నేపథ్యంలో షాక్​లో నుంచి సినీ ప్రియులు ఎవరూ కోలుకోలేకపోతున్నారు. దీంతో తదుపరి విడుదల ఎప్పుడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పుడు మూవీటీమ్​.. కొత్త రిలీజ్ ​డేట్​ గురించి కూడా కసరత్తులు చేస్తుందని తెలుస్తోంది. సినిమాను వీలైనంత త్వరగా తీసుకురావాలని ట్రై చేస్తుందట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12కు తీసుకొచ్చేలా చూడాలని ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సంక్రాంతికి భారీ బాక్సాఫీస్ వార్​ జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు కమల్​హాసన్ ఇండియన్ 2, మహేశ్​ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ సహా పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.