Begin typing your search above and press return to search.

సలార్ పార్ట్ 1 కథ అలా ఉండబోతోందా?

సలార్ పార్ట్ 1లో ప్రభాస్ ఇంటర్నేషనల్ మాఫియాతో తలపడతాడనే ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 3:51 AM GMT
సలార్ పార్ట్ 1 కథ అలా ఉండబోతోందా?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్ 1 సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కంప్లీట్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సింపుల్ గా ఉన్నా కూడా హీరో క్యారెక్టర్ ని పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ టీజర్ సాగింది. దీంతో ఈ సినిమా లో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందనేది కొంత వరకు క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూడు పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయి లో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. నిజానికి ప్రభాస్ అనేసరికి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్తారు. వెళ్ళాక ఏ ఒక్క విషయంలో సంతృప్తి చెందలేకపోయిన సినిమా రిజల్ట్ మారిపోతుంది. అలాగే సాహో, రాధేశ్యామ్. ఆదిపురుష్ ఫలితాలు ఉన్నాయి.

ఇవి మరీ అంత తీసిపారేసే కథలు, మూవీస్ అయితే కాదు. కాని ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి. ఈ సారి మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా హోప్స్ తో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ పై ఇప్పుడు సోషల్ మీడియా లో ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. సలార్ పార్ట్ 1లో ప్రభాస్ ఇంటర్నేషనల్ మాఫియాతో తలపడతాడనే ప్రచారం నడుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాఫియా సామ్రాజ్యం పై సలార్ ఎలాంటి యుద్ధం ప్రకటించాడు. తన సత్తాని వారికీ ఎలా పరిచయం చేసాడు అనేది కథలో భాగంగా ఉండే ఛాన్స్ ఉందని జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ కథలు అంటే ఎక్స్ పెక్టేషన్స్ కి అందకుండా నెక్స్ట్ లెవల్ లో అదిరిపోయే థాట్స్ తో ఉంటాయని కేజీఎఫ్ సిరీస్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు సలార్ కూడా అంతకుమించే ఉంటుందని కూడా చెప్పారు. మరి సలార్ తో ప్రభాస్ కి సాలిడ్ హిట్ వస్తుందా లేదా అనేది చూడాలి.